సల్మాన్‌ సినిమాతో పోలీసుల కౌన్సిలింగ్

Update: 2015-11-25 04:25 GMT
రాజశ్రీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై వచ్చిన సినిమాల్లో మానవ సంబంధాలకు, ప్రేమ అభిమానాలకు ఓ రేంజ్ లో ఇంపార్టెన్స్ ఉంటుంది.  ఇంకా చెప్పాలంటే సల్మాన్ ఖాన్ - బరజాత్యాల కాంబినేషన్ లో రూపొందిన సినిమాలు వీటి చుట్టూతానే తిరుగుతాయి. అందుకే ఇప్పుడు పోలీసులు కూడా  ఈ కండలవీరుడి సినిమాని కౌన్సిలింగ్ కి వాడేస్తున్నారు.

సూరజ్ బరజాత్యా - సల్లూ భాయ్ కలిసి తీసిన లేటెస్ట్ మూవీ ప్రేమ్ రతన్ ధన్ పాయో. ఈ మూవీ అంతా విలువలు, సాంప్రదాయాల చుట్టూనే తిరుగుతుంది. అందుకే బీహార్ పోలీసులు.. ఇప్పుడీ సినిమాని పిల్లల కోసం  ప్రత్యేకంగా షోలు వేయించి మరీ చూపిస్తున్నారు. చిన్నారులు హింస వైపు మళ్లకుండా.. వారి మనసులో అనురాగం - అభిమానం పెంపొందించాలన్నది వారి టార్గెట్. ఈ సినిమానే చూపించడానికి ఓ ప్రత్యేకమైన కారణం కూడా ఉంది. ప్రేమ్ రతన్ లో నటించిన పిల్లల్లో చాలామంది.. మావోయిస్టుల దాడిలో తల్లిదండ్రులను పోగొట్టుకున్నవారే.

బుల్లెట్స్ కంటే జ్ఞానమే ఎక్కువ శక్తివంతమైనది అనే మెసేజ్ ని పిల్లల నరనరాల్లో ఎక్కిండానికే.. ఇలా పిల్లలకు సినిమా చూపిస్తున్నట్లు పోలీసులు చెబ్తున్నారు. ఇందుకోసం గయ పోలీసులు వంద మందికి పైగా పిల్లలు, వారి గార్డియన్లతో కలిసి.. ప్రేమ్ రతన్ ధన్ పాయో చూశారు. కౌన్సిలింగ్ లో భాగంగా విలువలు నేర్పించేందుకు సినిమా చూపించాలన్న బీహార్  పోలీసుల ఆలోచనకు.. చాలా మంది హ్యాట్సాఫ్ చెబ్తున్నారు.
Tags:    

Similar News