టాలీవుడ్ : మనసు పెడితే ప్రేక్షకుడు హిట్టిస్తాడు

Update: 2022-08-07 07:30 GMT
వ‌రుస హౌస్ ఫుల్ బోర్డులు చూసి ఎంత కాలం అయింద‌ని..  కాలంతో ప్ర‌యాణిస్తే విషాదాలే కాదు విజ‌యాలు.. కూడా కనిపిస్తాయి. ఈ శుక్ర‌వారం రెండు సినిమాలు మంచి విజ‌యాల‌కు కార‌ణం అయ్యాయి. సినిమా ప్రతిష్ట‌ను పెంచాయి. అవి సీతారామం,  బింబిసార...ఒకే రోజు తెర‌పై ఆవిష్కృతం అయ్యాయి.

విజువ‌ల్ పోయెట్రీని చూసి చాలా కాలం అయింద‌ని చాలా  మంది అంటున్నారు. ఆ విధంగా సీతారామం గొప్ప సినిమా అంటున్నారు క్లాసిక్ ప్రియులు. మ‌ణి స‌ర్ లాంటి సినిమా ఒక‌టి హను తీశార‌ని అంతా అంటున్నారు. అంత గొప్ప స్థాయి ఈ సినిమా క‌థ‌లోనే ఉంద‌ని  విశ్లేషిస్తున్నారు.  

సాహిత్యం సిరివెన్నెల రాశారు. ఒక పాట బాగుంది. ఇంకొంత సాహిత్యం  అనంత్ శ్రీ‌రామ్,  కృష్ణ‌కాంత్ రాశారు. ఈ సినిమా స్వ‌రాల వేడుక‌ల్లోనే ఆ పాట‌ల మాధుర్యం తెలియ‌జెప్పారు  ద‌త్తు.  మీరు కథ అనుకోండి మంచి విలువలు ఉంటే మేం నిర్మాణ బాధ్యత‌లు అందుకుంటాం అని స్వ‌ప్న‌ద‌త్ చెబుతుంటే వీళ్లిలాగే చెబుతారులే అనుకున్నాం. కానీ ఆమె మాటే నిజమైంది. నిజంగానే మంచి సినిమాను నిర్మించారు. ఇవాళ.. సృజ‌నాత్మ‌క ధోర‌ణి ఉన్న సినిమా ప్రియులకు సీతారామం మంచి రోజులు తెచ్చింది.

ఎస్పీబాలుకు, వెన్నెల కవి   సీతారాముడికి నివాళి ఇస్తూ చేసిన కార్య‌క్ర‌మంలో దుల్క‌ర్ సంద‌డి  చేశారు. మృణాల్ ఠాగూర్ ఆయనతో చేయి కలిపారు. మాళ‌విక నాయ‌ర్, సంతోష్ శోభ‌న్ వేడుక‌ల‌కు అద‌న‌పు ఆక‌ర్ష‌ణ అయ్యారు. ఇవ‌న్నీ స్వ‌రాల వేడుక‌ల‌ను సుసంపన్నం చేశాయి. మొత్తానికి సీతారామం వైజ‌యంతీ మూవీస్  బ్యాన‌ర్ గౌర‌వాన్ని పెంచిందంటున్నారు. సినిమా విడుద‌ల త‌రువాత  హను రాఘవపూడి  స్థాయి కథ‌కుడిగా పెరిగింది. ఈ క‌థ‌కు ర‌ష్మిక వెన్నుద‌న్నుగా నిలిచారు. సినిమాకు ప్ర‌భాస్,  విజ‌య్ దేవ‌ర‌కొండ అన్నీ తామే అయి నిలిచారు. ఫైనల్లీ విశాల్ శేఖ‌ర్  సంగీతంతో ప్ర‌యాణిస్తూ ప్ర‌యాణిస్తూ హను మాయాజాలం చేశారు. ఆ విధంగా  ఈ  సినిమా ఓ హార్ట్ ఫుల్  వండ‌ర్. బాలు స‌ర్ అబ్బాయి చ‌ర‌ణ్ పాడిన పాట ఆకట్టుకుందంటున్నారు జనం. మ‌న తెలుగింటి ప్ర‌తిభావ‌ని ర‌మ్య  బెహ‌ర గ‌ళం కూడా ఎంతో బాగుంది.  భార‌తీయ సినిమాలో దుల్క‌ర్ కు మంచి పేజీ ఒక‌టి  ఉంటుంది. నాన్న మమ్ముట్టి పేరు  ఈయ‌న  త‌ప్ప‌క నిల‌బెడ‌తారు.  

డబ్బులుంటే ఏం చేస్తారు  అన్న ప్ర‌శ్న క‌ల్యాణ్  రామ్ ను అడ‌గ‌వ‌ద్దు. ఆయ‌న సినిమా నిర్మాణం కోసం ప‌రిత‌పిస్తారు. కొత్త ద‌ర్శ‌కుల‌కు ఆలంబ‌న‌గా నిలుస్తారు. ఆవిధంగా ఎన్టీఆర్ ఆర్ట్స్ ఎంద‌రికో అన్నం పెట్టింది.ఇప్పుడు నంద‌మూరి తార‌క రామారావు ఆర్ట్స్ బ్యాన‌ర్ పై హ‌రికృష్ణ నిర్మించిన చిత్రం బింబిసార. కొత్త ద‌ర్శ‌కుడికి రాజ‌మౌళితో పోలిక పెడుతున్నారు.అదొక్క‌టే త‌ప్పు  కానీ ద‌ర్శకుడు  వ‌శిష్ఠ్ కృషి బాగుంది. ఇంకా ఇంకొంద‌రు  కూడా! బాహుబ‌లి సౌండ్ ను   ఇంకోసారి ఉప‌యోగించే ఛాన్స్ కీర‌వాణి తీసుకున్నారు. చోటా కే  నాయుడు అనే ప్ర‌తిభావంతుడిదీ సినిమా. ఇక సెంథిల్ జ‌పం  చేయ‌డం క‌న్నా ర‌త్న‌వేలు జపం చేయ‌డం క‌న్నా  చోటాను అంతా మ‌రోసారి నెత్తిన పెట్టుకోవ‌చ్చు కూడా ! క‌నుక కొత్త రైట‌ర్ రాసిన మాట‌లు బాగున్నాయి అని అంటున్నారంతా ! ఓ తెలుగు మాస్టారికి దక్కిన  అవ‌కాశం ఇది. వాసు అనే కొత్త కుర్రాడు బాగా మాట‌లు రాయ‌గ‌ల‌రు అని నిరూపించద‌గ్గ సినిమా ఇది. అంద‌రికీ ఆల్ ద బెస్ట్. డ‌బ్బులుంటే ప్ర‌తిభ ఉంటే మంచి సినిమాలు వస్తాయి. అందుకు అతనొక్క‌డే ఓ ఉదాహ‌ర‌ణ. అందుకు ఇప్ప‌టి ఈ 2 సినిమాలు  తార్కాణాలు. అన్న‌య్య సినిమాకు అండ‌గా నిలిచిన తార‌క రాముడికి  జేజేలు   కూడా   !
Tags:    

Similar News