థియేటర్లకి జనాలు రావడం లేదని మొన్నటివరకూ ఒకటే అసంతృప్తి. టిక్కెట్ ధరలు తగ్గించినా? ప్రేక్షకులు థియేటర్ వైపు చూసింది లేదు. ఓటీటీకి అలవాటు పడిపోవడం సహా ఎన్నో కారణాలు తెరపైకి వచ్చాయి. ఇదే కొనసాగితే థియేటర్లు పూర్తిగా మాసేయాల్సిందేనని ఒకటే అందోళన మొదలైంది. ఈ క్రమంలో ప్రేక్షకుల్ని ఎలాగైనా థియేటర్ కి రప్పించాలని రకరకాల జిమ్ముక్కులు సైతం ప్రద్శించారు.
బట్టల దుకాణాల్లో ఆఫర్లు మాదిరి బై వన్ గెట్ వన్ పద్దతిలో టిక్కెట్లు విక్రయాలు జరిపారు అంటే సన్నివేశంత ఎంత దారుణంగా ఉందో అద్దం పట్టింది. దీనిపై దర్శక-నిర్మాతలు-హీరోలు ఒకింత ఆందోళనకి గురయ్యారు. జనాలు సినిమాలు చూడటం మానేస్తే? మా పరిస్థితి ఏంటి? అన్న సందేహం సైతం మనసుల్లో రేకెత్తింది. బయటకు ఎవరూ ఓపెన్ కాలేదు.
కానీ గుండెల్లో ఆ సన్నివేశం రైళ్లనే పరిగెట్టించింది. కోవిడ్ తగ్గిన తర్వాత జనాల్లో వచ్చిన ప్రధానమైన మార్పు ఇది. అయితే ఆ ఆందోళనలన్నింటిని..సందేహాలన్నింటిని `బింబిసార..`సీతారామం` చిత్రాలు పటా పంచల్ చేసాయి. రెండు సినిమాలు హిట్ టాక్ తెచ్చుకోవడంతో థియేటర్ గేటు ముందు హౌస్ ఫుల్ బోర్డులు కనిపిస్తున్నాయి.
దీంతో టెన్సన్ పడ్డ వారంతా ఊపిరి తీసుకుంటున్నారు. ఇండస్ర్టీ వర్గాల్లో ఆనందబాష్పాలు విలసిల్లుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి సైతం ఈ సన్నివేశాన్ని గుర్తు చేస్తూ ఓ ట్వీట్ కూడా చేసారు. కంటెంట్ ఉన్న సినిమాల్ని తెలుగు ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తారు అనడానికి ఇదే నిదర్శనం అంటూ `బింబిసార`..`సీతారామం` చిత్రాల్ని ఉదహరించారు.
అయితే ఇప్పుడీ వేగాన్ని అప్ కమింగ్ రిలీజ్ లు అన్ని కంటున్యూ చేయగలగాలి. భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోన్న `లైగర్` హిట్ అందుకుని యువతని థియేటర్ల వైపు పరుగులు పెట్టించాలి. అలాగే సస్పెన్స్ థ్రిల్లర్ గా ప్రేక్షకుల ముందుకొస్తున్న `కార్తికేయ-2` అంచనాల్ని అందుకోవాలి. యూత్ స్టార్ నితిన్ నటించిన `మాచర్ల నియోజకవర్గం` కమర్శియల్ సక్సెస్ సాధించాలి.
పాన్ ఇండియావ వైడ్ రిలీజ్ అవుతోన్న `లాల్ సింగ్ చడ్డా` అదే రేంజ్ విజయం సాధించి బాలీవుడ్ ఏడాది బ్లాక్ బస్టర్ గా నిలవాలి. ఇవన్నీ భారీ అంచనాల మధ్య రిలీజ్ అవుతోన్న చిత్రాలు. ఇవన్నీ థియేటర్ ముందు హౌస్ ఫుల్ బోర్డులతో బాక్సాఫీస్ ని షేక్ చేసేలా ఉండాలి. అప్పుడే థియేటర్లు పూర్వ వైభవాన్ని అందుకున్నట్లు లెక్క. ఈ ఆర్డర్ లో ఎక్కడ తేడా జరిగినా కథ మొదటికి వచ్చినట్లే.