నందమూరి కల్యాణ్ రామ్ హీరోగా నటిస్తూ.. స్వీయ నిర్మాణంలో రూపొందుతున్న సినిమా ''బింబిసార''. చారిత్రక నేపథ్యమున్న సోషియో ఫాంటసీ కథాంశంతో కొత్త దర్శకుడు వశిష్ఠ్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఇటీవల విడుదలైన టైటిల్ లుక్ - మోషన్ పోస్టర్ విశేష స్పందన తెచ్చుకున్నాయి. చెడు నుంచి మంచి వైపు సాగిన టైం ట్రావెల్ మూవీ అని చెప్పి మేకర్స్ సినిమాపై అంచనాలు పెంచేశారు. ఇందులో బార్బేరియన్ కింగ్ బింబిసార గా కళ్యాణ్ రామ్ పవర్ ఫుల్ రోల్ లో కనిపించనున్నాడు. అయితే తాజాగా ఫిలిం సర్కిల్స్ లో వినిపిస్తున్న వార్తలు ఈ సినిమాపై మరింత హైప్ ను తీసుకొస్తున్నాయి.
అదేంటంటే.. 'బింబిసార' చిత్రాన్ని మూడు భాగాలుగా విడుదల చేయనున్నారట. ముందుగా సింగిల్ మూవీగా చేయాలని స్టార్ట్ చేసినప్పటికీ.. ఇప్పుడు మగధ రాజ్యాన్ని పాలించిన రాజుల చరిత్రను 3 భాగాలుగా చెప్పాలని నిర్ణయించుకున్నారట. అయితే ప్రతి భాగానికి కొంత గ్యాప్ ఉంటుందని అంటున్నారు. ఇప్పటికే ఫస్ట్ పార్ట్ కు సంబంధించిన షూటింగ్ 80 శాతం షూటింగ్ కూడా కంప్లీట్ అవ్వగా.. దీనికి దాదాపు 40 కోట్ల వరకు బడ్జెట్ అయినట్లు ప్రచారం జరుగుతోంది. కరోనా పరిస్థితులు కుదట పడగానే చిత్రీకరణ తిరిగి ప్రారంభించి.. ఈ ఏడాది ద్వితీయార్ధంలో ఫస్ట్ పార్ట్ ని విడుదల చేయాలని చూస్తున్నారని సమాచారం. ఇదే కనుక నిజమైతే టాలీవుడ్ లో 3 పార్ట్స్ గా వచ్చే ఫస్ట్ సినిమా ఇదే అవుతుంది.
ఇకపోతే 'బింబిసార' చిత్రానికి యంగ్ టైగర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇవ్వనున్నారని వార్తలు వస్తున్నాయి. భారీ స్థాయిలో రూపొందుతున్న ఈ సినిమాకి తారక్ గొంతు తోడైతే మరో లెవల్ కి వెళ్తుందని మేకర్స్ భావిస్తున్నారట. ఎన్టీఆర్ స్వరం ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ అవుతుందని నందమూరి అభిమానులు భావిస్తున్నారు. 'బింబిసార' కల్యాణ్ రామ్ కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో రూపొందుతోన్న సినిమా. భారీ సెట్స్ - గ్రాఫిక్స్ హంగులు దీనికి కీలకం కానున్నాయి. పాన్ ఇండియా స్థాయిలో తెలుగుతో పాటుగా పలు భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారు. ఇందులో కేథరీన్ ట్రెసా - సంయుక్తా మేనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. నందమూరి తారకరామారావు ఆర్ట్స్ బ్యానర్ పై కె.హరికృష్ణ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.