నందమూరి కళ్యాణ్ రామ్ ఇటీవల తన తాత నందమూరి తారక రామారావు జయంతి సందర్బంగా బింబిసార ఫస్ట్ లుక్ టీజర్ ను విడుదల చేసిన విషయం తెల్సిందే. అంతకు ముందు వరకు బింబిసార సినిమా గురించి కూడా పెద్దగా మీడియాలో వార్తలు వచ్చిందే లేదు. భారీ సినిమా అంటే ముందు నుండే హంగామా ఉంటుంది. కాని బింబిసార సినిమా ప్రకటించేప్పటికే చాలా వరకు షూటింగ్ పూర్తి అయ్యిందట. సైలెంట్ గా సినిమా ను పట్టాలెక్కించడం పూర్తి చేయడం కూడా జరుగుతుందట. కళ్యాణ్ రామ్ కు ఈ సినిమా పై చాలా నమ్మకం ఉన్నట్లుగా ఉంది. అందుకే భారీ బడ్జెట్ తో స్వయంగా తానే ఈ సినిమా ను నిర్మిస్తున్నాడు.
కళ్యాణ్ రామ్ హీరోగా రూపొందుతున్న బింబిసార సినిమా గురించి ప్రకటించిన సమయంలోనే అంతా ఆశ్చర్యపోరారు. కాని తాజాగా ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా దాదాపుగా 75 శాతం పూర్తి అయ్యిందట. బ్యాలన్స్ వర్క్ కూడా కేవలం 25 నుండి 30 రోజుల వర్కింగ్ డేస్ తోనే పూర్తి చేయాలని భావిస్తున్నారట. భారీ బడ్జెట్ పౌరాణిక నేపథ్యం సినిమా ఇంత త్వరగా ఎలా ఎవరికి తెలియకుండా పూర్తి చేయగలిగారు అనే విషయమై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. కళ్యాణ్ రామ్ జోరు చూస్తుంటే పరిస్థితులు అనుకూలిస్తే సినిమా ను ఈ ఏడాదిలోనే విడుదల చేస్తారా ఏంటీ అనిపిస్తుంది.
నందమూరి కళ్యాణ్ రామ్ సక్సెస్ కోసం చకోరా పక్షి మాదిరిగా ఎదురు చూస్తున్నాడు. ఇలాంటి సమయంలో బింబిసార సినిమా ఎలా ఉంటుంది అనేది చూడాలి. ఒక వైపు బింబిసార ముగింపు దశకు వచ్చిన కారణంగా మరో వైపు స్పై థ్రిల్లర్ సినిమా కు ఈయన ఓకే చెప్పాడట. 1950 బ్యాక్ డ్రాప్ లోని స్పై థ్రిల్లర్ కథను ప్రేక్షకుల ముందుకు కళ్యాణ్ రామ్ తీసుకు వచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లుగా తెలుస్తోంది. బింబిసార సినిమా లో హీరోయిన్స్ గా సంయుక్త మీనన్ మరియు క్యాథరిన్ తెర్సాలు నటిస్తున్నారు. షూటింగ్ పునః ప్రారంభం అయ్యిందా లేదా అనే విషయంలో స్పష్టత లేదు. బింబిసార మొత్తం సైలెంట్ గా చేసుకు పోతున్నారు. కనుక సెకండ్ వేవ్ తర్వాత చివరి దశ షూటింగ్ మొదలు పెట్టి ఉంటారని టాక్ వినిపిస్తుంది.