నిరోషకు వెల్‌ కమ్‌ చెబుతున్న బిందు

Update: 2015-08-27 17:30 GMT
ఒక బృందావనం, సోయగం .. ఒకే ఇది.. మ్యాస్ట్రో ఇళయరాజా స్వరపరిచిన గీతమిది. 90లలో రిలీజైన ఘర్షణ సినిమాలోనిది ఈ పాట. ఆ సినిమాలో కథానాయిక నిరోష అందాల ఆరబోత అప్పట్లో హాట్‌ టాపిక్‌. ఆ సినిమా తర్వాత కూడా నిరోష కొన్ని సినిమాల్లో హాట్‌ గా దర్శనమిచ్చి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అయ్యింది. నిరోష తెలుగు, తమిళ ప్రేక్షకులకు బాగానే సుపరిచితం. తమిళ్‌ లో అగ్ని నక్షత్రంతో మొదలెట్టి చాలా సినిమాల్లో నటించింది. అనేక సీరియల్ సులో నాయికగా నటించింది. ఈ సినిమాలు, సీరియళ్లు అక్కడ బ్లాక్‌ బస్టర్‌ హిట్స్‌. అయితే కాలక్రమంలో నిరోష సినిమాలకు దూరమైంది.

మళ్లీ ఇంతకాలానికి మరోసారి ముఖానికి రంగేసుకుని కనిపించనుంది. అదీ తెలుగమ్మాయ్‌ బిందుమాధవి కథానాయికగా నటిస్తున్న 'సావలే సామళి' అనే చిత్రంలో ఓ కీలకపాత్రలో నటిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమంలో పాల్గొన్న నిరోష గురించి బిందుమాధవి ముచ్చటిస్తూ.. మ్యాడమ్‌ సినిమాలకు పెద్ద ఫ్యాన్‌ ని. ఒరు పూంగ వనం చాలా ఇష్టమైన సినిమా. తనతో కలిసి నటించడం చాలా బావుంది అంటూ తెగ ఉబ్బితబ్బిబ్బయ్యింది. వెల్‌ కమ్‌ టు నిరోష
Tags:    

Similar News