టాలీవుడ్ లో ప్రస్తుతం బయోపిక్ ల సందడి కొనసాగుతోంది. ఈ సంవత్సరం ఆరంభంలో సావిత్రి గారి జీవిత చరిత్ర ఆధారంగా వచ్చిన ‘మహానటి’ ఎంతటి విజయాన్ని దక్కించుకుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆ ఇన్సిపిరేషన్ తో ఎన్నో బయోపిక్ లు రెడీ అవుతున్నాయి. ప్రస్తుతం తెలుగులో తెరకెక్కుతున్న బయోపిక్ ల విషయానికి వస్తే చిరంజీవి హీరోగా ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవితాన్ని ప్రేక్షకుల ముందుకు ‘సైరా’ చిత్రంను తెరకెక్కిస్తున్నారు. ఇక ఎన్టీఆర్ జీవితాన్ని ‘ఎన్టీఆర్’ చిత్రంతో క్రిష్ మరియు బాలయ్యలు ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్దం అవుతున్నారు.
ఇంకా వైఎస్ రాజశేఖర్ రెడ్డి - కత్తి కాంతారావు - చంద్రబాబు నాయుడు - కొండ మురళి - కేసీఆర్ లతో పాటు తమిళం మరియు తెలుగులో మాజీ సీఎం జయలలిత బయోపిక్ కూడా తెరకెక్కుతుంది. ఇంత మంది బయోపిక్ లతో పాటు తాజాగా ఘంటసాల గారి జీవిత చరిత్రను కూడా వెండి తెరపై ఆవిష్కరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఘంటసాల గారు చనిపోయి నాలుగు దశాబ్దాలు అయినా కూడా ఇంకా ఆయన పాటలతో తెలుగు ప్రేక్షకుల మదిలో బతికే ఉన్నారు. అలాంటి వ్యక్తి జీవిత చరిత్ర కు రంగం సిద్దం అయ్యింది.
ప్రముఖ సింగర్ కృష్ణ చైతన్య - ఘంటసాల గారి పాత్రలో నటించబోతున్నాడు. ఆయన భార్య మృదుల కీలకమైన ఘంటసాల గారి భార్య పాత్రలో కనిపించబోతుంది. చాలా కాలంగా ఘంటసాల జీవితంపై రీసెర్చ్ చేసిన సీహెచ్ రామారావు ఈ చిత్రంకు దర్శకత్వం వహించబోతున్నాడు. లక్ష్మి నీరజ ఈ చిత్రాన్ని నిర్మించేందుకు ముందుకు వచ్చారు. ఇక ఘంటసాల మూవీ అంటే సంగీతం గురించి ఎక్కువ చర్చ జరుగుతుంది. ఈ చిత్రానికి వాసు రావు సంగీతాన్ని అందించబోతున్నాడు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ ను జరుపుకుంటున్న ఈ చిత్రం అతి త్వరలోనే సెట్స్ పైకి వెళ్లబోతుందంటూ సమాచారం అందుతుంది. ఈ చిత్రానికి సంబంధించిన అన్ని విషయాలు అధికారికంగా త్వరలో బయటకు వస్తాయంటూ సినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.