కోడి గుడ్ల కోసం అప్పు చేసింది

Update: 2016-11-10 01:30 GMT
పెద్ద డినామినేషన్ ఉన్న కరెన్సీ నోట్లను రద్దు చేస్తున్నామంటూ మోడీ ఇచ్చిన షాక్.. దేశంలో చాలా ప్రకంపనలే రేపింది. రోజంతా దేశవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఇదే హాట్ టాపిక్.. దీనిపైనే డిస్కషన్స్. సామాన్యులకు కూడా కొంత అసౌకర్యం ఉంటుందని స్వయంగా ఆర్థికమంత్రే ఒప్పుకున్న సంఘటన ఇది. అయితే.. ఈ ఎఫెక్ట్ పేదల కంటే ఎక్కువగా ధనవంతులపైనే ఉంటోంది. కొందరు బాలీవుడ్ సెలబ్రిటీలైతే తమ అనుభవాలను అభిమానులతో పంచుకునేందుకు వెనకాడలేదు కూడా.

ఒకానొక సమయంలో టాప్ రేటెడ్ హీరోయిన్ అయిన బిపాషా బసులాంటి భామకు కేవలం కోడి గుడ్లు కొనుక్కునేందుకు కష్టాలు ఎదురయ్యాయంటే నమ్మగలమా? సాధారణ పరిస్థితుల్లో అయితే నవ్విపోయే వాళ్లే కానీ.. ఇప్పుడు అయ్యో అనక తప్పని సిట్యుయేషన్. 'ఇప్పుడే కోడి గుడ్లు కొనుగోలు చేసేందుకు రాకీ స్టార్ వరల్డ్ దగ్గర నుంచి డబ్బులు అప్పు తీసుకున్నా. మొదటి రోజు ఇలా గడిచింది' అంటూ ట్వీట్ చేసింది బిపాషా.

ఇక దర్శకుడు కబీర్ ఖాన్ భార్య.. టీవీ నటి అయిన మిని మాథుర్.. 'మా ఇల్లంతా కలిసి దాచి పెట్టిన మొత్తం రూ. 732. మా చిన్నారి పిగ్గీ బ్యాంక్ కూడా పగలకొట్టాల్సి వచ్చింది' అని ట్వీట్ చేసింది. మోడీ ఎఫెక్ట్.. చిన్నారులు దాచుకున్న మొత్తాలపై కూడా పడిందన్న మాట.
Tags:    

Similar News