బర్త్ డే బిపాషా.. అందాలతో బెదిరించేసింది

Update: 2017-01-08 12:44 GMT
బిపాషా బసు గతేడాది పెళ్లి చేసుకుని సెటిల్ అయిన సంగతి తెలిసిందే. కరణ్ సింగ్ గ్రోవర్ ని పెళ్లి చేసుకున్నాక.. అంతగా వార్తల్లో కనిపించని బిపాషా.. మళ్లీ ఇప్పుడు పుట్టినరోజు సందర్భంగా సెల్ఫీలు.. ఫోటోలతో తెగ రెచ్చిపోయింది. తన భర్తతో కలిసి ఆస్ట్రేలియాలో ఏ రేంజ్ లో ఎంజాయ్ చేస్తోందో చూపించిన ఈ బ్యూటీ.. అందులో తమ అనుబంధాన్ని కూడా చూపించేసింది.

తమ కాపురం ఎంత చక్కగా సాగుతోందో.. ఎంత ధృడంగా తమ మధ్య అనుబంధం ఉందో చూపించిన బిపాషా.. ఓ సెల్ఫీతో ఫ్యాన్స్ కు కనువిందు చేసేసింది. వైట్ టాప్ తో అద్దం ముందు నుంచుని బిపాషా తీసుకున్న సెల్ఫీ ఫ్యాన్స్ కి మళ్లీ అలనాటి సెక్సీ సుందరిని గుర్తు తెచ్చేసింది. ఎక్కడెక్కడ అందాలు చూపించాలో.. ఎక్కడెక్కడ దాచిపెట్టాలో అంత పర్ఫెక్ట్ గా ఉన్న టాప్ ను వేసుకుని.. బర్త్ డే సెల్ఫీని స్పెషల్ గా పోస్ట్ చేసింది బిపాషా బసు.

ఇప్పటికీ ఇంత సెక్సీగా రెచ్చగొడుతున్న ఈ అందాల భామ వయసు ఇప్పుడు 38 ఏళ్లు అంటే నమ్మడం కాస్త కష్టమే కానీ.. నమ్మక తప్పని విషయం. ఈ ఏజ్ లో కూడా ఈ తరం భామలకు ఏ మాత్రం తీసిపోని కొలతలతో సవాల్ విసురుతోంది బిపాషా బసు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News