బిపాషా అది కూడా మార్చేసింది

Update: 2016-06-13 15:30 GMT
బిపాషా బసు.. ఈ బ్లాక్ బ్యూటీ ఇప్పుడు పెళ్లి చేసేసుకుని సెటిల్ అయిపోయింది. కరణ్ సింగ్ గ్రోవర్ తో ఏప్రిల్ చివర్లో పెళ్లి చేసుకున్న బిపాషా.. ఇప్పుడు వరుసగా పేర్లు మార్చే పనిలో పడింది. తన పేరుకు చివర భర్త పేరును యాడ్ చేసుకుంటూ వస్తోంది. అధికారికంగా ఎలాగూ మారతాయ్ కానీ.. ఇప్పుడు సోషల్ నెట్ వర్క్ లలోనూ, మూవీ టైటిల్ కార్డ్స్ లోనూ మారిన పేరు డిస్ ప్లే అయ్యేలా జాగ్రత్త పడుతోంది.

రీసెంట్ గా ఇన్ స్టాగ్రామ్ లో తన పేరును బిషా సింగ్ గ్రోవర్ అని మార్చింది బిపాషా. 'ట్విట్టర్ లో కూడా పేరు మార్చేందుకు ప్రయత్నించా కానీ.. అంత పొడుగు ఉన్న పేరును ఆ సైట్ యాక్సెప్ట్ చేయడం లేదు. అందుకే ట్విట్టర్ వదిలేశాను. ఇక నా నెక్ట్స్ పిక్చర్ లో కూడా నా పేరు బిపాషా బసు సింగ్ గ్రోవర్ అని టైటిల్ పడుతుంది' అని చెప్పింది ఈ బాలీవుడ్ హాటీ. అంత పెద్ద పేరెందుకు అంటే 'నా సర్ నేమ్ కు చివర భర్త పేరును యాడ్ చేసుకున్నాను అంతే కదా. నాకు ఆ పేరు బాగా నచ్చింది' అని చెప్పింది బిపాషా.

పేరు సరే వంట సంగతేంటి బిప్స్ అని అడిగితే.. 'నాకు వంట చేయడం వచ్చు కానీ బద్ధకం ఎక్కువ. నాకంటే నా భర్తే వంట బాగా చేస్తాడు. తను హోటల్ మేనేజ్మెంట్ చదివాడు కాబట్టి ఇంకా సులభం. నాకు ఇష్టమైన వంటకం చికెన్ ఖో స్యూయ్. నాకు థాయ్ వంటకాలు బాగా వచ్చు. కరన్ కి ఏది ఇష్టమనదో నేనింకా రుచి చూడలేదు' అంటూ నవ్వేస్తోంది బాలీవుడ్ బిప్స్.
Tags:    

Similar News