ఫోటో స్టోరి: సెక్సీ సెల్ఫీ కపుల్

Update: 2017-07-21 05:34 GMT
బాలీవుడ్ బ్యూటీ బిపాషా బసు.. ఇప్పుడు పెళ్లి చేసుకుని సెటిల్ అయిపోయిన సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత సినిమాలకు బాగా దూరం పాటిస్తున్న ఈ బ్యూటీ.. ఫ్యాన్స్ ని మాత్రం వదులుకోవడం లేదు. ఎప్పటికప్పుడు తన ఫాలోయర్స్ కు దగ్గరగా ఉండేందుకే ట్రై చేస్తున్న బిపాషా.. అందుకోసం సోషల్ మీడియాను సాధనంగా చేసుకుంది.

ఈ సుందరి ఎప్పుడు ఎక్కడకు వెళుతోంది.. ఏం చేస్తోంది అనే సంగతులు అభిమానులకు ఎప్పటికప్పుడు తెలిసిపోతున్నాయంటే అందుకు కారణం ఇన్ స్టాగ్రామ్. ప్రస్తుతం తన భర్త కరణ్ సింగ్ గ్రోవర్ తో కలిసి మియామి బీచ్ లో చక్కర్లు కొడుతోంది బిపాషా. అక్కడి నుంచి హాట్ హాట్ సెల్ఫీలతో రచ్చ చేస్తోంది. తాజాగా ఈ మొగుడూ పెళ్లాలు ఇద్దరూ కలిసి సౌత్ మియామీ బీచ్ నుంచి ఓ హాట్ సెల్ఫీని పోస్ట్ చేశారు. ఇద్దరి స్విమ్ వేర్ లోనే ఉండడం ఈ పిక్ స్పెషాలిటీ. 38 ఏళ్ల వయసులోనూ తనలోని హాట్ నెస్ ఏ మాత్రం తగ్గలేదని బిపాషా చెప్పకనే చెబుతుంటే.. తాను కూడా తెగ హాట్ అని నిరూపించేస్తున్నాడు కరణ్ సింగ్ గ్రోవర్.

'సూర్యుడితో పాటు మా లవ్ ఎఫైర్ కూడా కంటిన్యూ అవుతోంది' అంటూ ఓ కొటేషన్ కూడా పెట్టిన బిపాషా.. హాట్ లుక్స్ తో రెచ్చగొట్టేస్తోంది. ఏమైనా.. తన భార్య హాట్ అందాలను పబ్లిక్ కి చూపించేందుకు ఏ మాత్రం వెనుకాడని కరణ్ సింగ్ గ్రోవర్ స్టైల్ లోనే.. తమ ఇద్దరూ ఎంతటి హాట్ కపుల్ అనే సంగతి చెప్పేందుకు బిపాషా కూడా పెద్దగా ఆలోచించకపోవడం విశేషం.
Tags:    

Similar News