బాలీవుడ్ గ్లామరస్ హీరోయిన్లలో ఒకరు బిపాసా బసు. సినీ ఇండస్ట్రీలో ఎక్కువ శాతం బోల్డ్ సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఈ ఢిల్లీ భామ హిందీ సినిమాలతో పాటు తమిళ, తెలుగు, బెంగాలీ, ఇంగ్లీష్ సినిమాలలో నటించింది. ఎన్నో బోల్డ్ అండ్ రొమాంటిక్ సినిమాలలో మెరిసిన బిపాసా తెలుగులో మహేష్ బాబు సరసన టక్కరిదొంగ అనే సినిమాలో నటించింది. కానీ అదే ఈ భామకి ఫస్ట్ అండ్ లాస్ట్ తెలుగు మూవీ. మళ్లీ తెలుగులో కనిపించలేదు. అయితే బాలీవుడ్ లో అజ్నాబి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ.. జిస్మ్ అనే ఎరోటిక్ థ్రిల్లర్ మూవీతో మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. ఇక అప్పటినుండి అమ్మడు రొమాంటిక్ సినిమాలే చేసింది. అయితే కెరీర్లో ఎందరో హీరోలతో ఇంటిమేట్ సన్నివేశాలలో నటించిన ఈ భామ ఒక హీరోతో ముద్దు సన్నివేశంలో మాత్రం చాలా ఇబ్బంది పడిందట.
అతనెవరో కాదు స్టార్ యాక్టర్ మాధవన్. మాధవన్ సరసన బిపాసా 'జోడిబ్రేకర్స్' అనే సినిమాలో నటించింది. ఆ సినిమాలో మాధవన్ సరసన రొమాంటిక్ సీన్లలో నటించేందుకు ఎలా ఇబ్బంది పడిందో చెప్పుకొచ్చింది అమ్మడు. ప్రస్తుతం పెళ్ళై దాంపత్య జీవితం ఎంజాయ్ చేస్తున్న బిపాసా.. "మాధవన్ నేను మంచి స్నేహితులం. ఒక నటిగా రొమాంటిక్ సన్నివేశాల్లో నటించడం నాకు కాస్త ఇబ్బందిగానే ఉంటుంది. జోడీ బ్రేకర్స్‌లో మాధవన్‌ని లిప్ కిస్ చేయాల్సి వచ్చినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. ఆ సీన్ ఉందని తెలిసిన ముందు రోజే హార్ట్ ఎటాక్ వచ్చినట్లు అయ్యింది. మాధవన్ నాకు మంచి స్నేహితుడు. ఈ సీన్ ఎలా చేయాలని చాలా కంగారు పడిపోయాను. ఇక మొత్తానికి ఆ సీన్ పూర్తి చేసినప్పుడు మాధవన్ తో పాటు అందరూ నవ్వుకున్నారు. ఇంటిమేట్ సీన్లలో నటించేముందు సెట్‌లో నడుస్తూ.. మాట్లాడుతూ ఉంటాను. అక్కడున్న అందరినీ ఎంటర్‌టైన్ చేస్తుంటాను" అని బిపాసా తెలిపింది.