ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న అతిపెద్ద సెలబ్రేటి ఫ్యామిలి ఏదంటే..ఎవ్వరైనా సరే మెగా ఫ్యామిలీ అనేస్తారు. మెగా స్టార్ చిరంజీవి బ్రాండ్ నుంచి వచ్చిన హీరోలందరు దాదాపు బాక్స్ ఆఫీస్ ధీరులుగా నిలిచారు. ఎవరి స్థాయికి తగ్గట్టు వారు ఒక స్టార్ డమ్ ని తెచ్చుకున్నారు. అయితే ఎంత స్టార్ డమ్ వచ్చినా కూడా మెగా ఫ్యామిలి ఒక చోట కలిస్తే ఆ సందడే వేరు. ఎంత బిజీగా ఉన్నా కూడా ఏదైనా వేడుకలు జరిగితే మెగా యువత మొత్తం ఒక చోట చేరిపోతారు.
రీసెంట్ గా అలాంటి మూమెంట్ ఒకటి వచ్చింది. మెగాస్టార్ చీరంజీవి పెద్ద కూతురు సుస్మిత పుట్టిన రోజు కావడంతో అందరు ఒక చోట చేరారు. స్టయిలిష్ స్టార్ అల్లు అర్జున్ అలాగే ఆయన సతీమణి అల్లు స్నేహతో పాటు మెగా స్టార్ చిన్న కూతురు శ్రీజ ఆమె భర్త కల్యాణ్.. మెగా మేనల్లుడు సాయిధరమ్ తేజ్.. నాగబాబు కుమార్తె నిహారిక కూడా సుస్మిత బర్త్ డే ఫంక్షన్ లో పాల్గొన్నారు. ఇక అందరు కలిసి మెగా డాటర్ కి హ్యాపీగా బర్త్ డే విషెస్ అందించి గోల గోల చేశారు.
చివరగా కేక్ కట్ చేసి చిన్న పిల్లల్లా అల్లరి చేశారు. ఇక అందరు కలిసి ఓ సెల్ఫీకి స్టిల్ కూడా ఇచ్చారు. చాలా రోజుల తరువాత గ్యాప్ దొరకడంతో మెగా యువత అంతా ఒక చోట మెరిశారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో మెగా అభిమానులు కూడా పోటోలను తెగ షేర్ చేసుకుంటున్నారు.