విషెస్ తో ఊరించారు.. ఛాన్సెస్ ఏవి?

Update: 2016-08-02 04:35 GMT
రింగులు జుత్తు గంగగా.. తెలుగులో వీర ఫేమస్ అయిన హీరోయిన్.. తాప్సీ పన్ను. మిస్ ఇండియా పోటీల్లో పాల్గొని.. చివరకు వెళ్లకపోయినా కూడా.. ఫెమీనా మిస్‌ ఫ్రెష్‌ ఫేస్‌ వంటి అవార్డులను గెలుచుకుంది. అయితే 2010లో అమ్మడు ఝుమ్మంది నాదం సినిమాతో తెలుగు తెరకు పరిచయమై ఒక డజను సినిమాలు చేసుంటుంది. గ్లామర్ ఆరబోయడంలో అమ్మడి తరువాతే ఎవరైనా. కాని ఒక్క హిట్టయినా వస్తే ఒట్టు.

ఇకపోతే 1987 ఆగస్టు 1న దిల్లీలో జన్మించిన తాప్సీ.. నిన్ననే తన 29వ పుట్టినరోజును చేసుకుంది. ఒక బాలీవుడ్ సినిమా షూటింగ్ కోసం లండన్ వెళ్లిన తాప్సీ.. నిద్రలేచి చూసేసరికి.. ఇండియాలో ఎక్కడ చూసినా అమ్మడు ట్రెండింగ్. అందుకే అమ్మడు తెలుగులో ధన్యవాదాలు.. తమిళంలో నండ్రి అంటూ అందరికీ థ్యాంక్స్ చెప్పింది. అయితే తెలుగు సెలబ్రిటీల విషయానికొస్తే.. దాదాపు ఒక 30 మంది ఈ పుట్టినరోజున తాప్సీకి విషెస్ చెప్పుంటారు. దాదాపు ప్రతీ మీడియా హౌస్ కూడా ఆమెకు విషెస్ చెప్పిందనే చెప్పాలి. ఈ ఊరింపు అంతా సరే.. మరి తాప్సీకి విషెస్ ఒక్కటేనా.. ఛాన్సులు ఏమైనా ఇస్తారా?

బాలీవుడ్డులో ఇప్పుడు 'పింక్‌' సినిమాయే కాకుండా.. మరోడు రెండు ఉమెన్ ఓరియెంటడ్ సినిమాలు చేస్తోంది తాప్సీ. వరుసగా ఈ ఏడాది అంతటికీ సరిపడేంత పని చేతిలో ఉంది. పైగా తెలుగులో గ్లామర్ రోల్స్ అయితే చేయనని తెగేసి చెప్పేసిందట. సో.. మనోళ్ళు విషెస్ ఒక్కటే ఆఫర్ చేయగలరు అనే వేరే చెప్పక్కర్లేదు!!
Tags:    

Similar News