బిర్యానీకి కూడా బాహుబలిని వాడేస్తారా

Update: 2016-12-23 22:30 GMT
ఓ కాన్సెప్ట్ క్లిక్ అయినా.. ఓ కేరక్టర్ క్లిక్ అయినా.. దాన్ని అడ్డగోలుగా అడ్డదిడ్డంగా విచ్చలవిడిగా వాడేయడానికి చాలామంది రెడీగా ఉంటారు. ముఖ్యంగా సినిమాల్లో సూపర్ గా క్లిక్ అయిన కాన్సెప్ట్ లను అయితే.. అస్సలు వదలనే వదలరు.

టాలీవుడ్ రెండేళ్లుగా బాహుబలి అనే పేరు టాప్ ట్రెండింగ్ లోనే ఉంటోంది. ఇప్పటికే బాహుబలిని.. దానికి వచ్చిన క్రేజ్ ని వాడుకుంటూ.. ఆ సినిమా యూనిట్ వర్గాలే నానా రకాలుగా ట్రై చేసేస్తున్నారు. వీఆర్ గ్లాసెస్.. కామిక్ బుక్స్ వచ్చేయగా.. బాహుబలి మర్కెండైజ్.. టీవీ సిరీస్ లు క్యూలో ఉన్నాయి. ఇదంతా ఓ ఎత్తయితే.. ఇలాంటి ట్రెండింగ్ కాన్సెప్ట్ లను బయటి జనాలు మరో రేంజ్ లో వాడేస్తారు. హైద్రాబాద్ జూబిలీ హిల్స్ లోని ఓ ఫేమస్ రెస్టారెంట్ లో ఇప్పుడు బాహుబలి పేరుతో బిర్యానీ కూడా వడ్డించేస్తున్నారు. దీని స్పెషాలిటీ ఏంటంటే మటన్+చికెన్+ప్రాన్స్.. ఈ మూడింటినీ కలిపి బిర్యానీ చేసేస్తారట.

పేరుకు తగ్గట్టుగానే రేటు కూడా భారీగానే పెట్టారు. సాధారణంగా బిర్యానీ దొరికే రేటుకు.. బాహుబలి బిర్యానీ ధర డబుల్ ఉంటుంది. సహజంగా ఇలాంటి కాన్సెప్ట్ కి మిక్సెడ్ బిర్యానీ అనేపేరు ఇదివరకు వినిపించేది.. ఇప్పుడు బాహుబలి పుణ్యమా అని.. డబుల్ రేటుకు అదే అమ్మేసుకునే ఛాన్స్ వచ్చింది. అదే మరి బాహుబలి క్రేజ్ అంటే!

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News