పాపం .. రష్యాలో చలికి రష్మిక ఒణికిపోయిందట!

Update: 2022-08-02 16:25 GMT
దుల్కర్ సల్మాన్ .. మృణాళిని ఠాకూర్ జంటగా 'సీతా రామం' సినిమా రూపొందింది. అశ్వనీదత్ నిర్మించిన ఈ సినిమాకి హను రాఘవపూడి దర్శకత్వం వహించాడు. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకి సంగీతాన్ని సమకూర్చాడు. ఈ సినిమాలో కథానాయికగా మహారాష్ట్ర బ్యూటీ మృణాల్ ఠాకూర్ కథానాయికగా నటించింది.

ప్రకాశ్ రాజ్ .. భూమిక .. సుమంత్ .. వెన్నెల కిశోర్ .. తరుణ్ భాస్కర్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, రష్మిక కీలకమైన పాత్రను పోషించింది. స్టార్ హీరోయిన్ గా బిజీగా ఉన్న రష్మిక, హీరోయిన్ తరువాత స్థానంలో ఒక పాత్రను చేయడానికి ఒప్పుకోవడం విశేషం.

ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్స్ లో రష్మిక కూడా బిజీగా ఉంది. తాజాగా ఆమె బిత్తిరి సత్తి ఇంటర్వ్యూలో మాటల గారడీ .. నవ్వుల సందడి చేయడం విశేషం. సాధారణంగా బిత్తిరి సత్తితో ఇంటర్వ్యూ అంటే  ఆయన యాస అర్థంకానివారు వెనకడుగు వేస్తారు. కానీ రష్మిక ధైర్యం చేసి  .. ఆయన యాసను అర్థం చేసుకుని సమాధానాలు చెప్పడం విశేషం. బిత్తిరి సత్తి  ప్రశ్నలకు సమాధానంగా రష్మిక మాట్లాడుతూ .. " ఈ కథ 1964లో జరుగుతుంది. ఆ కాలానికి సంబంధించిన లెటర్ ఆధారంగా సీతను రామ్ ను కనుక్కోవడమే కథ.

1964కి సంబంధించిన వాతావరణాన్ని తెరపై చూపించడం చాలా కష్టం. ఆ కాలానికి సంబంధించిన కాస్ట్యూమ్స్ కావాలి .. వెహికల్స్  కావాలి .. అప్పటి లుక్ రావాలి. ఇవన్నీ సెట్ చేసుకుంటూ వెళ్లడం అంత తేలికైన విషయమేం కాదు. అప్పటి వాతావరణాన్ని తెరపై చూపించడం కోసం అందరూ కూడా ఎంతో కష్టపడ్డారు. ఈ సినిమాకి సంబంధించిన కొన్ని సీన్స్ ను రష్యాలో  చిత్రీకరించారు. అక్కడ చలికి తట్టుకోలేక నేను ఒణికిపోయాను.  ఎముకలను కొరికే చలి .. ఆ చలికి నేను తట్టుకోలేకపోయాను. అక్కడ ఎక్కువ రోజులు ఉండటం వల్ల కాదనే విషయం నాకు అర్థమైపోయింది.

ఆ తర్వాత షెడ్యూల్ ను కశ్మీర్ లో  చేశారు .. అక్కడ రష్యాలో కంటే చలిగా ఉందని తరుణ్ భాస్కర్ చెప్పాడు. దేవుడి దయవలన నా పాత్రకి సంబంధించిన షూటింగ్ అక్కడ లేదు గనుక నేను వెళ్లేలేదు .. వెళితే ఏమైపోయేదాన్నో ఏంటో. నా పాత్రకి సంబంధించిన సీన్స్ వరకూ డబ్బింగ్ చెబుతూ చూశాను. మిగతా సినిమాను తెరపై చూడాలని నాకు చాలా ఆత్రుతగా ఉంది. అందుకే రిలీజ్ డేట్  కోసం నేను కూడా మీ అందరి మాదిరిగానే వెయిట్ చేస్తున్నాను.

ఈ సినిమాలో నాకు .. దుల్కర్ కి మధ్య సీన్స్ లేవు. తను మంచి ఆరిస్ట్ అనే విషయం నాకు తెలుసు. తనకి గల ఫాలోయింగ్ గురించి విన్నాను. భవిష్యత్తులో ఆయనతో కలిసి నటించే ఛాన్స్ రావాలని కోరుకుంటున్నాను. తప్పకుండా వస్తుందనే భావిస్తున్నాను.

నా పాత్రకి నేను డబ్బింగ్ చెప్పుకోవడమే నాకు ఇష్టం. అందువల్లనే తమిళ్ .. మలయాళం కూడా నేర్చుకుంటున్నాను. ఆడియన్స్ అంతగా అభిమానిస్తున్నప్పుడు నా నుంచి పెర్ఫెక్ట్ కంటెంట్ ఉండాలని నేను కోరుకుంటాను. అందుకోసం రోజుకి 36 గంటలు ఉంటే బాగుండునని అనిపిస్తూ ఉంటుంది" అని చెప్పుకొచ్చింది.


Full View
Tags:    

Similar News