బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ నటించిన మూవీ రయీస్ పై బీజేపీ నేత పెట్టిన ట్వీట్ వివాదాస్పదంగా మారింది. షారుక్ సినిమా చూడొద్దనేలా పరోక్షంగా బీజేపీ సీనియర్ కైలాష్ విజయ్ వర్గియా పెట్టిన ట్వీట్ వివాదమవుతోంది. షారుక్ ఖాన్ సినిమా రయీస్ - హృతిక్ రోషన్ నటించిన కాబిల్ ఒకే రోజు విడుదల అవుతున్నాయి. దీంతో ఈ రెండింటినీ పోల్చుతూ కైలాష్ ఓ ట్వీట్ చేశారు. దేశభక్తి లేని ఆ రయీస్ (ధనికులు) వల్ల ఏం ప్రయోజనం లేదు.. మనమంతా కాబిల్ (సమర్థ) దేశభక్తుడికి మద్దతు తెలుపుదాం అంటూ కైలాష్ పరోక్షంగా షారుక్ రయీస్ సినిమా చూడొద్దన్న అర్థమొచ్చేలా ట్వీట్ చేశారు.
అయితే కైలాస్ చేసిన ట్వీట్ వివాదం కావడంతో బీజేపీ వివరణ ఇచ్చింది. కైలాష్ నల్లధనం అంశంపై అలా వ్యంగ్యంగా వ్యాఖ్యానించారని బీజేపీ అధికార ప్రతినిధి షైనా ఎన్సీ ట్వీట్ చేశారు. కైలాష్ ట్వీట్ తోపాటు మోదీ నల్లధనంపై సాధించిన విజయానికి గుర్తుగా తాను సంబరాలు చేసుకుంటున్న ఫొటోను కూడా జత చేసిన విషయాన్ని షైనా గుర్తు చేశారు. ఇక ట్వీట్ లో ఎక్కడా షారుక్ లేదా హృతిక్ పేరు కూడా ప్రస్తావించకపోవడాన్ని ఎత్తిచూపారు. అయితే ఈ ట్వీట్ పై కైలాష్ మాత్రం ఇప్పటివరకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కానీ గతంలోనూ షారుక్ ఖాన్ లక్ష్యంగా కైలాష్ విమర్శలు చేశారు. "షారుక్‌ఖాన్ ఇండియాలో ఉంటున్నా మనసు మాత్రం పాకిస్థాన్‌లో ఉంటుంది. ఆయన సినిమాలు ఇండియాలో కోట్లు గడిస్తున్నా.. షారుక్‌కు మాత్రం ఇక్కడ అసహనం కనిపిస్తుంది" అని 2015లో కైలాష్ వ్యాఖ్యానించారు. దీంతో ఇప్పుడూ ఆయన రయీస్‌కు వ్యతిరేకంగానే ఇలా పరోక్ష ట్వీట్ చేశారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/