సుశాంత్‌ మృతిపై ఎంపీ మరో అనుమానం

Update: 2020-10-14 13:00 GMT
బాలీవుడ్‌ హీరో సుశాంత్‌ మృతిపై అనేక అనుమానాలు ఉన్నాయంటూ ఆయన కుటుంబ సభ్యులు మరియు అభిమానులు సీబీఐ ఎంక్వౌరీకి డిమాండ్‌ చేయగా ప్రభుత్వం సీబీఐకి కేసు బాధ్యతలను అప్పగించడం తెల్సిందే. గత కొన్ని నెలలుగా సీబీఐ వారు తీవ్రంగా కృషి చేస్తూ ఈ కేసును ఛేదించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటి వరకు సుశాంత్‌ ది హత్య అంటూ వారికి ఎలాంటి ఆధారాలు లభించలేదట. ఈ సమయంలోనే ఎంపీ సుబ్రమణ్య స్వామి పదే పదే సుశాంత్‌ ది హత్య అంటూ ఆరోపిస్తున్నాడు. ఆయన అందుకు సంబంధించి పలు అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నాడు.

ఇటీవల ఆయన మరో అనుమానంను వ్యక్తం చేస్తున్నాడు. సుశాంత్‌ మృతికి ముందు జ్యూస్‌ తాగాడు అని ఎంక్వౌరీలో వెళ్లడి అయ్యింది. మరి ఆ జ్యూస్‌ తాగిన గ్లాస్ ఎక్కడ అంటూ ఎంపీ సుబ్రమణ్య స్వామి ప్రశ్నించాడు. ఆ గ్లాస్ ను ఎవరు మాయం చేసి ఉంటారు అంటూ ఆయన ప్రశ్నించాడు. జ్యూస్‌ లో ఏమైనా విషం కలిపి ఉంటారేమో అంటూ ఆయన అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. మొత్తానికి ఈ కేసులో ఆయన వ్యక్తం చేస్తున్న అనుమానాలు అభిమానులకు మరింతగా చిక్కుముడిగా ఉంటున్నాయి. సీబీఐ వారు ఆ గ్లాస్‌ విషయంలో ఏమైనా సమాధానం ఇస్తారేమో చూడాలి.
Tags:    

Similar News