పైరసీ - ఫ్రీ స్ట్రీమింగ్ వంటివాటితో భారీగా నష్టమేర్పడుతోందని సినీ నిర్మాతలు - నిర్మాణ సంస్థలు గగ్గోలు పెడుతున్నారు. అయితే, ఎన్ని ప్రయత్నాలు చేసినా దీనికి అడ్డుకట్టపడడం లేదు. ఇప్పుడు ఇండియాలో హాలీవుడ్ సినిమాలకూ ఈ బెడద తప్పడం లేదు.దీంతో హాలీవుడ్ కు చెందిన ప్రతిష్ఠాత్మక నిర్మాణ సంస్థలూ కేసులు వేయాల్సిన పరిస్థితి వచ్చింది.
తాజాగా వార్నర్ బ్రదర్స్ సంస్థ కొన్ని వెబ్ సైట్లు తమ సినిమాలను ఉచితంగా ఇస్తున్నాయని ఫిర్యాదు చేయడంతో వాటిని బ్లాక్ చేయాలంటూ కోర్టు ఆదేశించింది. తమిళ్ రాకర్స్ - ఈజెడ్ టీవీ - కట్ మూవీస్ - లైమ్ టొరెంట్స్ వంటి సైట్లను తాత్కాలికంగా బ్లాక్ చేయమని ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను(ఐ.ఎస్.పి) దిల్లీ హైకోర్టు ఆదేశించింది.
అమెరికాకు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్.. తమ నిర్మాణ సంస్థ నుంచి వెలువడిన చిత్రాలను - వెబ్ సిరీస్ లను అనధికారికంగా తమిళ్ రాకర్స్ వంటి ప్రైవేటు వెబ్ సైట్స్ వీక్షకులకు ఉచితంగా అందిస్తున్నాయి అని హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసింది.
పిటిషన్ ను స్వీకరించి వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి సంజీవ్ నారులా.. అటువంటి వైబ్‌సైట్లకు నెటిజన్స్ ప్రవేశించకుండా వాటి యూఆర్‌ఎల్స్(యూనిఫాం రిసోర్స్ లెకేటర్స్) - ఐపీ అడ్రెస్ లను బ్లాక్ చేయవలసిందిగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లను(ఐ.ఎస్.పి) కోరారు. అలానే నిర్మాణ సంస్థలకు చెందిన కాపీరైట్లను ఉల్లంఘించినందుకు ఆ వెబ్ సైట్లపై నమోదు చేసిన డొమైన్ పేర్లను తొలగించి తగిన చర్యలు తీసుకోవాలని సమాచార సాంకేతిక మంత్రిత్వశాఖకు మార్గనిర్దేశం చేశారు. నెట్ ఫ్లిక్స్ - యూనివర్సల్ - పారామౌంట్ - స్టార్ కి చెందిన కాపీరైట్ కంటెంట్లను అనధికారికంగా వాడుతున్న వెబ్ సైట్స్ పై నిఘాపెట్టి వాటిని తొలగించే విధంగా ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్లకు తగిన నోటిఫికేషన్ జారీ చేయాలంటూ డిపార్ట్ మెంట్ ఆఫ్ టెలీకమ్యూనికేషన్స్ కు హైకోర్టు సూచించింది.