మెగా బాబు.. ఇంటర్నేషనల్ క్యాంపెయిన్

Update: 2016-03-19 17:30 GMT
మెగాస్టార్ వారసుడు అంటే.. ముందుగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గుర్తొచ్చినా.. చిరు తనయుడుగా రామ్ చరణ్ తేజ్ కు ఎంతో క్రేజ్ ఉంది. అందివచ్చిన అభిమానులతో పాటు సొంతగా సంపాదించుకున్న ఫ్యాన్ బేస్ కూడా ఎక్కువగానే ఉంటుంది. మరి ఈ మెగా బాబు బర్త్ డే సెలబ్రేషన్స్ అంటే ఏ రేంజ్ లో ఉండాలి.? ఫ్యాన్స్ ఎక్స్ పెక్టేషన్స్ కి మాత్రం తగ్గకుండా ఈసారి రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలు జరగనున్నాయి.

గ్రాండ్ గా అంటే.. పార్టీలు చేసుకోవడం కాదు.. సమాజంలో చైతన్యం నింపేలా ప్రపంచవ్యాప్తంగా బ్లడ్ డొనేషన్ క్యాంపులు నిర్వహించబోతున్నారు. మార్చ్ 27న చెర్రీ పుట్టిన  రోజు సందర్భంగా ప్రపంచవ్యాప్తంగా అనేక దేశాల్లో ఈ క్యాంప్ లు ఏర్పాటు కానున్నాయి. అమెరికాలో 5, మస్కట్ లో 2, దుబాయ్-కతార్ లలో ఒక్కోటి చొప్పున బ్లడ్ డొనేషన్ క్యాంప్స్ ఏర్పాటు చేస్తున్నారు. మహరాష్ట లో 5, ముంబైలో ఒకటి, బెంగళూరు సిటీలో 9, తమిళనాడులో 3 సెంటర్లతో పాటు.. ఏపీ తెలంగాణల్లో 180-190 బ్లడ్ డొనేషన్ క్యాంప్ లు ఏర్పాటు కానున్నాయి. ఒక్కో సెంటర్ లోను వెయ్యి మందిని రక్త దానం చేసేలా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు.

ఈమేరకు రామ్ చరణ్ ఆఫీస్ నుంచి అధికారికంగానే ప్రకటన వచ్చింది. ఈ బ్లడ్ క్యాంప్స్ కు రోటరీ క్లబ్స్ - ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ - లయన్స్ క్లబ్ వంటి ఛారిటీ సంస్థలు మద్దతు ఇస్తుండడం విశేషం. మొత్తం మీద ఈసారి రామ్ చరణ్ బర్త్ డేని చరిత్రలో నిలిచిపోయేలా ప్లాన్ చేశారు. ఒకరోజు రక్తదానంలో కొత్త రికార్డ్ నమోదయ్యే అవకాశం ఉందని టాక్.
Tags:    

Similar News