టాలీవుడ్ లో దర్శకులకు గడ్డుకాలం నడుస్తోందని చెప్పాలి. హిట్ కొడితే పర్లేదు.. ఒక వేళ ఫ్లాప్ మాత్రం.. అందరూ బ్లేమ్ చేసేస్తున్నారు. డైరెక్టర్లకు తాము చేసే ప్రతీ సినిమాని హిట్ కొట్టక తప్పని పరిస్థితి ఏర్పడిపోతోంది. రీసెంట్ గా వచ్చిన రెండు భారీ డిజాస్టర్లు ఇండస్ట్రీలో వేవ్స్ సృష్టిస్తున్నాయి.
బ్రహ్మోత్సవం ఫ్లాప్ విషయంలో.. శ్రీకాంత్ అడ్డాల చేసిన తప్పుల గురించి విపరీతమైన ప్రచారం జరుగుతోంది. పూర్తి స్క్రిప్ట్ చేతిలో లేకుండానే పట్టాలెక్కించడం - ప్రొడక్షన్ విషయంలో కంట్రోల్ లేకపోవడం - ప్రొడ్యూసర్ కి రెస్పాన్సిబిలిటీ వహించకపోవడం, ఒకటీ అరా సీన్లలో కనిపించే అతి చిన్న రోల్స్ కి కూడా సీనియర్లను, భారీ రెమ్యూనరేషన్ తీసుకునేవాళ్లను ఇరికించడం.. ఇలా శ్రీకాంత్ అడ్డాల తప్పులను చాలానే చూపిస్తున్నారు. ఇక సర్దార్ విషయంలో అయితే.. పూర్తిగా డైరెక్టర్ తప్పు కాకపోయినా.. అది కూడా కాస్ట్ ఫెయిల్యూరే.
ఈ రెండు సినిమాలకు అదనంగా, అనవసరంగా ఖర్చు చేసిన మొత్తం 10-15 కోట్లు ఉంటుందని ఓ అంచనా. ఎన్నెన్నో అంచనాల మధ్య రిలీజ్ అయ్యి, చివరకు బిగ్గెస్ట్ డిజాస్టర్స్ కోటాలో చేరిన ఈ రెండు సినిమాలతో.. చాలామంది నిర్మాతలు అలర్ట్ అయ్యారు. భారీ చిత్రాల నిర్మాతలే కాదు.. ఓ రేంజ్ బడ్జెట్ లో సినిమాలు తీసే ప్రొడ్యూసర్స్ కూడా కాస్ట్ విషయంలో కంట్రోలింగ్ దృష్టి పెట్టారని తెలుస్తోంది. టైట్ బడ్జెట్ లోనే మూవీ ఫినిష్ చేయాలని దర్శకులను సూచిస్తున్నారట. ఓ రకంగా ఇండస్ట్రీకి ఇది మంచిదే అయినా.. ఇంతకాలం వైభోగం వెలగబోసిన డైరెక్టర్లకు మాత్రం చుక్కలు కనిపించడం ఖాయం.