పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కథానాయకుడిగా క్రిష్ దర్శకత్వంలో `హరి హర వీరమల్లు` తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. భారీ తారా గణంతో చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పవన్ కి జోడీగా నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుంది. అలాగే కీలక పాత్రలో టాలీవుడ్..బాలీవుడ్ నటులు నటిస్తున్నారు. ఇప్పటికే నర్గీస్ ఫక్రీ ముఖ్య పాత్ర పోషిస్తుంది.
జాక్వెలిన్ పెర్నాండేజ్ పోషించిన రోల్ కి నర్జీస్ ఫక్రీని ఎంపికి చేసారు. జాకీ వ్యక్తిగత ఈడీ విచారణలో భాగంగా ప్రాజెక్ట్ కి ఎంపికై తప్పుకోవాల్సి రావడంతోనే ఈ సన్నివేశం ఎదురైంది. అలాగే మరో ముఖ్యమైన పాత్రకి బాలీవుడ్ హీరో అర్జున్ రాపంపాల్ ని తీసుకున్న సంగతి తెలిసిందే. సినిమా ప్రారంభమైన నాడే ఈ విషయం బయటకు వచ్చింది.
అయితే ఇప్పుడీ పాత్రలో అర్జున్ రాంపాల్ ఉన్నాడా? లేడా? అన్నది సందేహంగా మారింది. కొత్తగా మరో బాలీవుడ్ స్టార్ బాబి డియోల్ ని తెరపైకి తీసుకురావడంతోనే ఈ సందేహం మొదలైంది. రాంపాల్ ని రీప్లేస్ చేసి డియోల్ ని తీసుకొస్తున్నారా? లేక బాబి డియోల్ ని ప్రత్యేకమైన పాత్ర కోసం దించుతున్నారా? అన్నది మరో రకమైన సందేహం.
మరి క్రిష్ మదిలో ఏముందున్నది తెలియాల్సి ఉంది. ఏది ఏమైనా సినిమాలో భారీగా బాలీవుడ్ తారలు మాత్రం కనిపిస్తున్నారు. తెలుగు నటుల్ని పక్కనబెట్టి క్రిష్ హిందీ తారల్ని దించడంపై అసంతృప్తి జ్వాలలు తెరపైకి వస్తున్నాయి. తెలుగులో ఆ పాటి నటులు లేరా? అని మూతిబిగిస్తున్నారు. అలాగే ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది? అన్న దానిపైనా
స్పష్టత రావడం కష్టమన్నది తాజా అప్ డేట్.
పీకే రాజకీయంగా బిజీ అవ్వడంతో షూటింగ్ కి సవ్యంగా హాజరు కాలేకపోతున్నారు. ఏపీలో రాజకీయ సన్నివేశాలు డై బై డే యుద్ద వాతావరణాన్ని తలపిస్తున్నాయి. అలాగే పీకేని హత్య చేయడానికి రెక్కీలు సైతం నిర్వహిస్తున్నారని ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో పవన్ షూటింగ్ స్పాట్ కి హాజరవ్వడం కూడా అంత శ్రేయస్కరం కాదని జన సైనికులు భావిస్తున్నారు. మరి ఇలాంటి భయాలెన్నో వీరమల్లు వెంట కనిపిస్తున్నాయి. వీటన్నింటిని దాటుకుని వీరమల్లు పూర్తి చేయాలి. అటుపై ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలి.