ఒక్కణ్నే వస్తా.. ఒక్కణ్నే ఉంటా.. జనం కోసం పోరాడతా.. అంటూ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ ట్రైలర్ లో పవన్ కళ్యాణ్ చెప్పిన డైలాగ్ విన్నాక.. ఈ సినిమాలో కచ్చితంగా పొలిటికల్ డైలాగులు ఉంటాయని.. ప్రస్తుత రాజకీయాల మీద సెటైర్లు కూడా పడతాయని జనాలు ఓ అంచనాకు వచ్చేశారు. ఐతే తమ సినిమాలో అలాంటి డైలాగులేమీ ఉండవని అంటున్నాడు డైరెక్టర్ బాబీ. ‘‘పవన్ సార్ ఇందులో ‘సర్దార్ గబ్బర్ సింగ్’లో పొలిటికల్ డైలాగ్స్ ఏమీ చెప్పరు. కానీ ఆయన ఆల్రెడీ పొలిటీషియన్ కావడం వల్ల ఎవరికైనా ఏమైనా కనెక్ట్ అయినా చెప్పలేం కానీ.. ఉద్దేశపూర్వకంగా పొలిటికల్ డైలాగులు మాత్రం రాయించలేదు. కళ్యాణ్ గారికి సామాజిక స్పృహ ఎక్కువ.. ప్రజల గురించి ఎక్కువ ఆలోచిస్తారు కాబట్టి ఆ కోణంలో మాత్రం కొన్ని డైలాలుగుంటాయి’’ అని బాబీ చెప్పాడు.
పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్ సింగ్’కు ఘోస్ట్ డైరెక్షన్ చేశారని.. రెండు పాటలు ఇంకా బ్యాలెన్స్ ఉండగానే సెన్సార్ సర్టిఫికెట్ తీసేసుకున్నారని వస్తున్న వార్తల్ని బాబీ ఖండించాడు. ‘‘కళ్యాణ్ గారు ఈ సినిమాకు కథ - స్క్రీన్ ప్లే రాశారు. అంత వరకు క్రెడిట్ పూర్తిగా ఆయనదే. నేను ఆయన స్క్రిప్టును అడాప్ట్ చేసుకున్నాను. దాని మీద ఆరు నెలలు పని చేశాను. ఐతే దర్శకత్వం విషయంలో మాత్రం ఆయన పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. ఎక్కడా జోక్యం చేసుకోలేదు. నేను నా ప్లానింగ్ ప్రకారం సినిమా పూర్తి చేశాను. ఇక సెన్సార్ విషయంలో వస్తున్న రూమర్లు కూడా తప్పు. స్విట్జర్లాండ్ లో షూట్ చేసుకుని వచ్చిన పాటల్ని కూడా కలిపే సెన్సార్ చేయించాం’’ అని బాబీ అన్నాడు.