ఫోటోలు తీసిందే తమ్ముడన్న బన్నీ అన్నయ్య

Update: 2019-06-24 07:14 GMT
అన్నయ్య రెండో పెళ్లిలో అల్లు అర్జున్ లేకపోవడం గురించి మీడియాలో చిత్ర విచిత్రమైన కథనాలు రావడంతో మరోసారి అల్లు వెంకటేష్ అలియాస్ బాబీ స్పందించారు. తమ్ముడు లేడని వస్తున్న వార్తలు అవాస్తవమని అసలు తాను షేర్ చేసుకున్న ఫోటోలు తీసిందే తమ్ముడని కుండబద్దలు కొట్టేశారు. ఇంకొద్ది రోజుల్లో రిసెప్షన్ తాలూకు వీడియో పెడతానని అప్పుడు ఎవరు వచ్చారో ఎవరు రాలేదో మీకే తెలుస్తుందని చెప్పారు.

నిన్నంతా నానా రకాలుగా గాసిప్స్ ని వండి వడ్డించిన కొన్ని మీడియా సంస్థలకు ఇది గొంతులో పచ్చి వెలక్కాయ పడినట్టే అని చెప్పుకోవచ్చు. మొదటి వివాహం గురించి విడాకుల గురించి తేదీలతో సహా స్పష్టంగా చెప్పినా వాళ్ళు ఎందుకు రాలేదు అనే తరహాలో సైతం కొన్ని కథనాలు రావడంతో బాబీ కొంత అసహనానికి గురైనట్టు ఇన్ సైడ్ టాక్. అవును మరి పూర్తి సమాచారం లేకుండా ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తే ఆ మాత్రం ఫీలింగ్ కలగడం సహజం.

ఇప్పుడు బాబీ చెప్పిన వీడియో చూస్తే అల్లు అర్జున్ తో పాటు ఇంకా ఇతర మెగా అండ్ అల్లు ఫామిలీ మెంబెర్స్ కనిపించే అవకాశం ఉంది. చాలా కాలంగా మీడియాకు దొరక్కుండా వ్యాపార వ్యవహారాల్లో బిజీగా ఉండే బాబీ ఇప్పుడీ సెకండ్ మ్యారేజ్ వల్ల తమ్ముడి అభిమానులతో పాటు సగటు ప్రేక్షకుల దృష్టిలోకి వచ్చేశాడు . వేడుకకు సంబంధించిన పనులన్నీ కూడా బన్నీనే దగ్గరుండి చూసుకున్నాడని చెప్పిన బాబీ ఫైనల్ గా పుకార్లకు చెక్ పెట్టేసినట్టే


Tags:    

Similar News