నేషనల్ అవార్డ్ విన్నింగ్ విలన్ తెలుగులోకి..

Update: 2015-12-08 09:30 GMT
బాబీ సింహా.. వయసు 30 ఏళ్లకు అటు ఇటు ఉంటుంది. ఈ వయసులోనే బెస్ట్ విలన్ గా నేషనల్ అవార్డు గెలుచుకుని సంచలనం సృష్టించాడు ఈ టాలెంటెడ్ తమిళ యాక్టర్. గత ఏడాది సిద్దార్థ్ హీరోగా నటించిన సెన్సేషనల్ హిట్ ‘జిగర్ తాండా’ అతడికి నేషనల్ అవార్డు తెచ్చిపెట్టింది. ఈ సినిమా తెలుగులో కూడా విడుదలవ్వాల్సింది కానీ.. కాలేదు. ప్రస్తుతం మన రానా దగ్గుబాటితో కలిసి ‘బెంగళూర్ డేస్’ రీమేక్ లోనూ కీలక పాత్ర పోషిస్తున్నాడు బాబీ. ఈ నటుడు తెలుగులో అరంగేట్రం చేయబోతున్నాడు. సందీప్ కిషన్ హీరోగా తెరకెక్కబోయే ‘123’ సినిమాలో ఇతను విలన్ పాత్ర పోషించబోతున్నాడు.

ప్రేమమ్ దర్శకుడు అల్ఫాన్సో పుతెరిన్ తొలి సినిమా ‘నేరం’కు రీమేక్ గా రాబోతున్నదే  123 మూవీ. తమిళ వెర్షన్లో బాబీనే విలన్ గా నటించాడు. ఆ సినిమాతోనే బాబీ అంటే ఏంటో తమిళ ప్రేక్షకులకు తెలిసింది. ఆ తర్వాత అద్భుతమైన పాత్రలతో ఎక్కడికో వెళ్లిపోయాడు. మిస్టర్ నూకయ్య ఫేమ్ అని కన్నెగంటి దర్శకత్వం వహించబోతున్న ‘123’లో సందీప్ సరసన అనీషా ఆంబ్రోస్ కథానాయికగా నటించబోతోంది. ‘నేరం’ అంటే తమిళంలో సమయం అని అర్థం. కాలం కలిసి రాకుంటే అన్నీ నెగెటివ్ గానే అవుతాయని.. కలిసొస్తే అంతా అద్భుతంగా ఉంటుందనే కాన్సెప్ట్ ను వెరైటీ స్క్రీన్ ప్లేతో చెప్పిన సినిమా ఇది. తమిళ, మలయాళ భాషల్లో సెన్సేషనల్ హిట్టయిన ఈ సినిమా తెలుగులో ఎలాంటి ఫలితాన్నందుకుంటుందో చూడాలి.
Tags:    

Similar News