శ్రీ‌య మ్యూజిక్ స్కూల్ లో చేరిన బాలీవుడ్ న‌టుడు!

Update: 2021-09-03 10:30 GMT
టాలీవుడ్ లోకి బాలీవుడ్ స్టార్ల వెల్లువ ఇటీవ‌ల అంత‌కంత‌కు పెరుగుతోంది. అమితాబ్ బ‌చ్చ‌న్.. వివేక్ ఒబేరాయ్ లాంటి స్టార్లు తెలుగు సినిమాల‌కు సౌత్ సినిమాల‌కు సంత‌కాలు చేస్తున్నారు. సోనూసూద్ ఇప్ప‌టికే టాలీవుడ్ లో టాప్ రేంజ్ విల‌న్ గా వెలుగుతున్నారు. ఇంకా ఎంద‌రో హిందీ తార‌లు టాలీవుడ్ లో పెద్ద స్టార్లు గా ఎదిగేస్తున్నారు.

ఇదే కేట‌గిరీలో మ‌రో న‌టుడు బ‌రిలో దిగుతున్నాడు. రంగ్ దే బసంతి.. 3 ఇడియట్స్ .. గోల్‌మాల్ ఫ్రాంచైజ్ చిత్రాల‌తో యువ‌న‌టుడు శర్మాన్ జోషి త‌న‌కంటూ ఫాలోయింగ్ సంపాదించుకున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం అత‌డు టాలీవుడ్ లో అరంగేట్రం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. శ్రియ శరన్ కొత్త తెలుగు సినిమా `మ్యూజిక్ స్కూల్‌`లో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం పాన్-ఇండియా కేట‌గిరీలో విడుదలవుతుంది. ఇందులో ఉత్త‌రాది ద‌క్షిణాది తారాగ‌ణం న‌టిస్తున్నారు.

శ్రీ‌య `మ్యూజిక్ స్కూల్‌`లో బ్రహ్మానందం- ప్రకాష్ రాజ్- సుహాసిని ములే- గ్రేసీ గోస్వామి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి అవార్డ్ చిత్రాల ద‌ర్శ‌కుడు పాపారావు బియ్యాల దర్శకత్వం వహిస్తున్నారు. అక్టోబర్ 15 న అధికారికంగా ఈ చిత్రం ప్రారంభ‌మ‌వుతోంది.

మ్యూజిక్ స్కూల్ విభిన్న క‌థాంశంతో రూపొందుతున్న సెటైరిక‌ల్ మూవీ. ప్రస్తుత విద్యా వ్యవస్థపై వ్యంగ్య క‌థాంశ‌మిద‌ని తెలుస్తోంది. పిల్లలను వారి త‌ల్లిదండ్రులు ఇంజనీర్ లేదా డాక్టర్ కావాల‌ని మాత్రమే పెంచుతారు. క‌ళాకారులు కావాల‌ని అనుకోరు..! దీనివ‌ల్ల వారిలో క‌ళ‌లు అంత‌రించిపోతున్నాయి! అనే కోణంలో క‌థాంశం ఆద్యంతం ఆస‌క్తిని రేకెత్తిస్తుంద‌ట‌. మాస్ట్రో ఇళయరాజా ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నారు.


Tags:    

Similar News