సల్మాన్ భాయ్ లాగే నేను కూడా వర్జిన్ అంటున్న కండల వీరుడు!

Update: 2021-08-03 11:30 GMT
బాలీవుడ్ యువ కథానాయకులలో టైగర్ ష్రాఫ్ ఒకరు. తెర మీద టైగర్ చేసే విన్యాసాలు, ప్రేక్షకులను, మరీ ముఖ్యంగా పిల్లలని థియేటర్ల వైపు మళ్లిస్తాయి. బాగీ సిరీస్ లో వచ్చిన చిత్రాలు, టైగర్ ష్రాఫ్ ని ప్రేక్షకులకి మరింత చేరువ చేశాయి. దీంతో, టైగర్ మోస్ట్ వాంటెడ్ నాయకుడిగా ఎదిగాడు. ఈ స్థాయికి చేరుకోవడానికి టైగర్ చాలా కష్టపడ్డాడు.

హీరోపంతి లో టైగర్ ని చూసిన వారందరూ అతన్ని బాగా ట్రోలింగ్ చేసేవారు. ఇతనేంటి ఇలా ఉన్నాడు, అసలు హీరోగా పనికొస్తాడా అని విమర్శలు చేసిన వాళ్లూ లేకపోలేదు. అసలు టైగర్ జాకీ ష్రాఫ్ కొడుకేనా అని కూడా అన్నారు. ఈ విషయంన్ని టైగర్ స్వయంగా తెలిపాడు.

సల్మాన్ ఖాన్ సోదరుడు అర్బాజ్ ఖాన్ హోస్ట్ చేసే క్విక్ హీల్ షో లేటెస్ట్ ఎపిసోడ్ లో టైగర్ అతిథిగా విచ్చేశాడు. తన బాల్యం గురించి, చిన్నతనం నుంచే సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో సావాసం చేయడం. మొదట్లో తాను ఎదురుకున్న ట్రోలింగ్ గురించి టైగర్ అర్బాజ్ ఖాన్ కి తెలిపాడు.

నువ్వు వర్జిన్ వా కాదా అని ఒక ఫ్యాన్ ప్రశంకి సమాధానం ఇస్తూ, తను సల్మాన్ ఖాన్ లాగానే వర్జిన్ అని తెలిపి అందరిని ఆశ్చర్యపరిచాడు. ఇటీవల విడుదలైన టీజర్ సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. మీరు కూడా ఒక లుక్కేయండి.

టైగర్ హీరోపంతి తో తెరంగేట్రం చేసినా, భాఘీ పెద్ద విజయం సాధించింది. భాఘీ2, స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ 2, వార్, భాఘీ3 టైగర్ నటించిన విజయవంతమైన సినిమాలు. ప్రస్తుతం టైగర్ చేతిలో హీరోపంతి 2, భాఘీ4, గణపత్, రాంబో 1 లాంటోయ్ భారీ చిత్రాలు ఉన్నాయి.


Tags:    

Similar News