ఇంట గెలిచి రచ్చ గెలవాలి. ఇక్కడ మనమేంటో నిరూపించుకున్న తర్వాతే అక్కడా సత్తా చాటాలి. అవును నిజమే. బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ ఇప్పుడు రచ్చ గెలవాడినికి సిద్దమైంది. మహేష్ భట్ వారసురాలిగా హిందీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన అలియా ఇక్కడ తనేంటో ప్రూవ్ చేసింది. నటిగా తనకంటూ ఓ ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది.
అనతి కాలంలోనే బాలీవుడ్ లో అగ్ర హీరోయిన్ల సరసన స్థానం సంపాదించింది. అమ్మడి బాలీవుడ్ కెరీర్ కి దశాబ్ధం దాటింది. 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్' తొ మొదలైన ప్రస్థానం 'గంగూబాయి కతియవాడి' వరకూ సక్సెస్ ఫుల్ గా సాగింది. గంగూబాయి విజయంతో అలియా ఇమేజ్ రెట్టింపు అయింది. నటిగా ప్రత్యేకమైన ఇమేజ్ ని సొంతం చేసుకుంది.
రొమాంటిక్ చిత్రాల్లో నటించింది. లేడీ ఓరియేటెండ్ చిత్రాల్లోనూ మార్క్ వేసింది. బాలీవుడ్ లో ఇంకా అలియా చేయాల్సిన ప్రయత్నాలు కొన్ని ఉన్నాయి. కానీ ఇంతలో హాలీవుడ్ లో ఆఫర్ రావడంతో అక్కడా అదృష్టాన్న పరీక్షించుకోవడానికి సిద్దమైన సంగతి తెలిసిందే. 'హార్ట్ ఆఫ్ స్టోన్' చిత్రం ద్వారా హాలీవుడ్ అలియాభట్ తెరంగేట్రం చేస్తుంది.
ఇటీవలే టీమ్ తో జాయిన్ అయింది. నటిగా సుదీర్ఘ అనుభవం ఉన్నా హాలీవుడ్ కి వెళ్లే సరికి టెన్షన్ తోనే మొదలైంది. అక్కడ సక్సెస్ అవుతుందా? ఫెయిలవుతుందా? అన్నది సినిమా ఫలితం పై ఆధారపడి ఉంటుంది. ఇప్పుడే అలియా బాలీవుడ్ కెరీర్ ని నిర్దేశించలేం. అయితే బాలీవుడ్ నుంచి హాలీవుడ్ కి వెళ్లిన కొంత మంది భామల గతంలోకి వెళ్తే నెగిటివ్ ఫీడ్ బ్యాక్ వస్తుంది.
'ఫైండింగ్ పన్నీ' మూవీతో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన దీపిక అక్కడ నిలదొక్కుకోలేకపోయింది. 'ట్రిపుల్ ఎక్స్ రిటర్న్' లాంటలి చిత్రాల్లో నటించిలనా దీపిక మార్క్ అక్కడ పడలేదు. దీంతో యాధవిధిగా మళ్లీ బాలీవుడ్ లోనే బిజీ అయింది. అంతకు ముందు 'ది లాస్ట్ లెజియన్' సినిమాతో ఐశ్వర్యారాయ్ కూడా ఇంగ్లీష్ సినిమా అదృష్టాన్ని పరీక్షించుకుంది.
'మిస్ట్రెస్ ఆఫ్ స్పైసెస్'.. 'బ్రైడ్ అండ్ ప్రెజుడైజ్'.. 'ప్రోవోక్డ్'.. 'ది పింక్ పాంథర్ 2' ల్లో నటించింది కానీ నిలబడలేదు. ఈ రేసులో కాస్త ప్రియాంక చోప్రానే బెటర్ పొజిషన్ లో ఉంది. 'క్వాంటికో'తో హాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక 'ది లైట్ టైగర్' వరకు అయిదు సినిమాలు చేసింది. ప్రస్తుతం ఇంకా సినిమాలు చేస్తుంది. ఆ రకంగా పీసీ వీళ్లందరికన్నా ఉత్తమంగానే నిలిచింది. ఇప్పుడు అలియాభట్ బరిలోకి దిగుతుంది. మరి ఈ యువ నాయిక పీసీ పడగొట్టి ఏ మేర ఇంగ్లీష్ ఆడియన్స్ ని మెప్పిస్తుందో చూద్దాం.