#RRR: రెమ్యునరేషన్ వల్లే ఎంపిక ఆలస్యం?

Update: 2019-02-07 06:39 GMT
దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న #RRR ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ చిత్రీకరణ జరుపుకుంటోంది.  ఈ షెడ్యూల్ లో లీడ్ యాక్టర్లపై రాజమౌళి కీలకమైన సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారట.  మొదటి షెడ్యూల్ అయిపోయింది. రెండో షెడ్యూల్ కూడా మూడో వారంలోకి అడుగుపెట్టింది కానీ రాజమౌళి టీమ్ ఇంతవరకూ ఈ సినిమా హీరోయిన్లను ఫైనలైజ్ చేయకపోవడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.

కొద్దిరోజుల క్రితం #RRR మేకర్స్ ఈ సినిమాలో హీరోయిన్ పాత్రల కోసం బాలీవుడ్ భామలైన అలియా భట్.. పరిణీతి చోప్రాలను సంప్రదించారట.  కానీ ఆ ఇద్దరూ భామలు తమ రెమ్యూనరేషన్ ఫిగర్ చెప్పి #RRR టీమ్ కు షాక్ ఇచ్చారట.  పరిణీతి 4 కోట్ల రూపాయలు డిమాండ్ చేయగా అలియా భట్.. నేనేం తక్కువ అన్నట్టుగా రూ. 6 కోట్లు డిమాండ్ చేసిందట. బాలీవుడ్ లో హీరోయిన్లకు ఆ రేంజ్ రెమ్యూనరేషన్ ఇవ్వడం కామనే గానీ సౌత్ లో ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ అయినా రెండుకోట్ల లోపే ఉంటుంది.  నయనతార లాంటి వారు మాత్రమే ఎక్సెప్షన్.  అలాంటిది ఈ బాలీవుడ్ భామలు కోట్ చేసిన ఫీజుకు #RRR టీమ్ వారిని తీసుకుందామా వద్దా అనే ఆలోచనలో పడిపోయారట.

అందుకే ఈ సినిమా కోసం సౌత్ హీరోయిన్లనే తీసుకుందామని ప్లాన్ చేస్తున్నారట. సౌత్ హీరోయిన్లంటే రెమ్యూనరేషన్ తగ్గడంతో పాటుగా ఇతర డిమాండ్లు కూడా తగ్గుతాయిగా. మరి చరణ్.. తారక్ లకు జోడీగా ఆడిపాడనున్న ఆ అందమైన భామలు ఎవరో తెలిసేందుకు మనం మరి కొన్ని రోజులు వేచి చూడకతప్పదు. 
Tags:    

Similar News