బాలీవుడ్ బంప‌ర్ ఆఫ‌ర్..అంత‌లోనే..

Update: 2022-05-28 00:30 GMT
'మాస్ట‌ర్' బ్యూటీ మాళ‌వికా మోహ‌న‌న్ కు బాలీవుడ్ లో బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలిందా? .. గ‌త కొంత కాలంగా బాలీవుడ్ లో క్రేజీ ఆఫ‌ర్ ని సొంతం చేసుకుని బాలీవుడ్ లో పాగావేయాల‌ని ప్ర‌య‌త్నాలు చేస్తున్న ఆమెకు ఏకంగా బాలీవుడ్ కండ‌ల వీరుడు స‌ల్మాన్ ఖాన్ నుంచి బంప‌ర్ ఆఫ‌ర్ త‌గిలిందా? అంటే నిజ‌మంటూ కొంత మంది నెట్టింట ప్ర‌చారం మొద‌లు పెట్టారు. వివ‌రాల్లోకి వెళితే.. స‌ల్మాన్ ఖాన్ హీరో న‌టిస్తున్న తాజా బాలీవుడ్ మూవీ 'క‌భీ ఈద్ క‌బీ దివాళీ'.

ఫ‌ర్హాద్ స‌మ్జీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. త‌మిళ బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ ఫిల్మ్ 'వీరం' ఆధారంగా ఈ చిత్రాన్ని రీబేక్ చేస్తున్నారు. బాలీవుడ్ లో చాలా వ‌ర‌కు మార్పులు చేసి ఈ మూవీని రూపొందిస్తున్నారు. క‌థా విస్త‌ర‌ణ బాలీవుడ్ నిర్మాత సాజిద్ న‌దియావాలా చేయ‌గా స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తూ ఈ మూవీని నిర్మిస్తున్నారు. పూజా హెగ్డే హీరోయిన్ గా న‌టిస్తున్న ఈ మూవీలోని కీల‌క పాత్ర‌లో విక్ట‌రీ వెంక‌టేష్ న‌టిస్తున్నారు. విల‌న్ గా జ‌గ‌ప‌తిబాబు క‌నిపించ‌బోతున్నారు.

జ‌గ్గూ భాయ్ కిది హిందీలో ఎంట్రీ మూవీ. ఇటీవ‌లే రెగ్యుల‌ర్ షూటింగ్ మొద‌లైన ఈ మూవీని ఈ ఏడాది డిసెంబ‌ర్ 30కి ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురాబోతున్నారు. ఇప్ప‌టికే డేట్ ని కూడా ప్ర‌క‌టించేసింది చిత్ర బృందం.

ఇదిలా వుంటే ఈ మూవీలో 'మాస్ట‌ర్' బ్యూటీ మాళ‌విక మోహ‌న‌న్ న‌టిస్తోందంటూ వార్త‌లు షికారు చేస్తున్నాయి. సినిమాలో స‌ల్మాన్ ఖాన్ పాత్ర‌కు సోద‌రుడిగా సిద్ధార్ధ్ నిగ‌మ్ న‌టిస్తున్నాడు. అత‌నికి జోడీగా మాళవిక మోహ‌న‌న్‌ని ఎంపిక చేశారంటూ ప్ర‌చారం మొద‌లైంది.

అయితే ఈ ప్రాచారంలో నిజం లేద‌ని, ఇదంతా ఫేక్ న్యూస్ అని కొట్టిపారేసింది మాళ‌విక. స‌ల్మాన్ ఖాన్ న‌టిస్తున్న 'క‌బీ ఈద్ కబీ దివాళీ' మూవీతో తాను న‌టించ‌డం లేద‌ని మాళ‌విక క్లారిటీ ఇచ్చింది. ఇదిలా వుంటే ఇదే ఏడాది మాళ‌విక మోహ‌న‌న్ బాలీవుడ్ ప్రేక్ష‌కుల‌కు ప‌రిచ‌యం కాబోతోంది. సిద్ధాంత్ చ‌తుర్వేది హీరోగా రితేష్ సిద్వానీ,  ఫ‌ర్హాన్ అక్త‌ర్ నిర్మిస్తున్న ''యుధ్రా' మూవీతో బాలీవుడ్ కు హీరోయిన్ గా ప‌రిచ‌యం కాబోతోంది. చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్న ఈ మూవీ త్వ‌ర‌లో విడుద‌ల కాబోతోంది.    

ఇక ఇదే ఏడాది మాళ‌విక టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వ‌డానికి రెడీ అవుతున్న విష‌యం తెలిసిందే. గ‌తంలో 'హీరో' మూవీతో విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి ప‌రిచయం కావాల్సిన మాళ‌విక మోహ‌న‌న్ త్వ‌ర‌లో మారుతి డైరెక్ష‌న్ లో ప్ర‌భాస్ హీరోగా తెర‌పైకి రానున్న మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం కాబోతోంది. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు త్వ‌ర‌లోనే ద‌ర్శ‌కుడు మారుతి వెల్ల‌డించ‌నున్నారు.
Tags:    

Similar News