బాలీవుడ్‌ డ్ర‌గ్స్ కేసుః ఛార్జిషీటు వేసిన ఎన్సీబీ.. రియా ప‌రిస్థితి ఏంటీ..?

Update: 2021-03-09 02:30 GMT
బాలీవుడ్ న‌టుడు సుశాంత్ సింగ్ మ‌ర‌ణంతో క‌దిలిన డ్ర‌గ్స్ డొంక‌.. అటూ ఇటూ తిరిగి ఆయ‌న ప్రియురాలు రియా చ‌క్ర‌వ‌ర్తి మెడ‌కు చుట్టుకున్న విష‌యం తెలిసిందే. ఈ డ్ర‌గ్స్ కార‌ణంగానే సుశాంత్ ను రియా చ‌క్ర‌వ‌ర్తి ఆత్మ‌హ‌త్య‌కు ప్రేరేపించిందనే కోణంలో కేసు న‌మోదైంది. రంగంలోకి దిగిన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు.. ఎంతో మందిని విచారించి, చాలా వివ‌రాలు సేక‌రించి, ఫైన‌ల్ గా చార్జ్ షీట్ దాఖ‌లు చేశారు.

ఈ కేసులో మొత్తం 12 వేల పేజీల‌తో కూడిన చార్జ్ షీట్ ను దాఖ‌లు చేశారు అధికారులు. మొత్తం 32 మందిని నిందితులుగా పేర్కొన్న ఎన్సీబీ.. సుమారు 200 మంది సాక్షులుగా చూపించింది. ఛార్జ్ షీట్ దాఖ‌లు చేసిన త‌ర్వాత మాట్లాడిన అధికారులు.. కాల్ రికార్డులు, వాట్సాప్ చాటింగ్‌, బ్యాంకు డాక్యుమెంట్ల ఆధారంగా విచార‌ణ సాగించిన‌ట్లు చెప్పారు.

ఈ ఛార్జ్ షీట్ ఆధారంగానే త‌దుప‌రి విచార‌ణ కొన‌సాగుతుంద‌ని తెలిపారు. అయితే.. ఈ ఛార్జ్ షీట్ ను రియా చ‌క్ర‌వ‌ర్తి లాయ‌ర్ లైట్ తీసుకున్నారు. ఊహించ‌న‌ట్టే ఛార్జి షీట్ ఉంద‌న్న లాయ‌ర్ స‌తీష్ మానేషిండే.. అదంతా ఓ వ్యంగ్య ర‌చ‌న అంటూ కొట్టిపారేయ‌డం విశేషం.
Tags:    

Similar News