బాలీవుడ్‌ పరిస్థితి దారుణం.. ఈ ఏడాది వంద కోట్ల సినిమాలు ఏవి?

Update: 2022-12-09 03:50 GMT
కరోనాకు ముందు బాలీవుడ్‌ ఇండస్ట్రీ లో ఉన్న సందడి ఇప్పుడు కనిపించడం లేదు. వందల కోట్ల సినిమాలు సునాయాసంగా వచ్చేవి. అక్షయ్ కుమార్‌ నటించిన ప్రతి ఒక్క సినిమా కూడా కరోనాకు ముందు బాక్సాఫీస్ వద్ద కోట్లు.. రెండు వందల కోట్లు రాబట్టేది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. హిందీ ప్రేక్షకులు థియేటర్ల దారి పట్టడం మానేశారా అన్నట్లుగా అక్కడి సినిమాల పరిస్థితి ఉంది.

వందల కోట్ల వసూళ్లు నమోదు చేసే స్థాయిలో బాలీవుడ్ సినిమాలు ఉండటం లేదు. 2022 సంవత్సరం పూర్తి అవ్వబోతుంది. ఈ ఏడాది బాలీవుడ్‌ సినిమాలు బాక్సాఫీస్ వద్ద సందడి చేసినవి ఎన్నీ అంటే వెంటనే చెప్పడానికి ఏ ఒక్క సినిమా కూడా కనిపించడం లేదు. సౌత్ లో సూపర్‌ హిట్‌ సినిమాలు అంటే చాలా సినిమాల పేర్లు వినిపిస్తున్నాయి. కానీ బాలీవుడ్‌ పరిస్థితి మాత్రం విభిన్నం.

బాలీవుడ్‌ లో ఈ ఏడాది చాలా సినిమాలే వచ్చాయి. అందులో కేవలం మూడు సినిమాలు మాత్రమే బాక్సాఫీస్ వద్ద వంద కోట్లు అంతకు మించి వసూళ్లు సాధించాయి అంటూ ఇండస్ట్రీ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. ఈ ఏడాది బాలీవుడ్‌ బిగ్గెస్ట్‌ హిట్‌ గా మనం యావరేజ్ అనుకుంటున్న బ్రహ్మాస్త్ర సినిమా నిలిచింది.

బ్రహ్మాస్త్ర సినిమా వంద కోట్ల క్లబ్‌ లో చోటు దక్కించుకుంది. ఆ సినిమా తో పాటు అజయ్ దేవగన్ నటించిన దృశ్యం 2 సినిమా కూడా తాజాగా వంద కోట్ల వసూళ్ల తో బాలీవుడ్‌ పరువు నిలిపింది. మలయాళ సూపర్‌ హిట్ దృశ్యం 2 కి అది రీమేక్ అనే విషయం తెల్సిందే. అజయ్ దేవగన్ ఏడాది చివర్లో వంద కోట్ల క్లబ్ లో చోటు ను సొంతం చేసుకున్నాడు.

ఇక చిన్న సినిమా గా వచ్చిన హిందీ సినిమా భూల్‌ భులయ్యా కూడా వంద కోట్ల క్లబ్‌ లో చేరింది. ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు కూడా పెద్దగా చేయకుండానే భారీగా వసూళ్లు నమోదు చేసింది.

ఇక డైరెక్ట్‌ హిందీ సినిమాలు కాకుండా బాలీవుడ్‌ బాక్సాఫీస్ వద్ద సౌత్‌ సినిమాలు అయిన ఆర్ ఆర్ ఆర్‌... కేజీఎఫ్‌ 2.. కాంతార.. విక్రమ్‌.. పొన్నియన్ సెల్వన్‌.. కార్తికేయ 2 సినిమాలు కూడా సందడి చేశాయి. హిందీ సినిమాలను డామినేట్‌ చేసినంతగా సౌత్‌ సినిమాల బాలీవుడ్ బాక్సాఫీస్ వసూళ్లు నమోదు అయ్యాయి.




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News