టాలీవుడ్ మోస్ట్ క్రేజీ మల్టీ స్టారర్ ఆర్ ఆర్ ఆర్ విషయంలో దర్శకుడు రాజమౌళి మౌన వ్రతాన్ని పాటిస్తున్నాడు. బయటికి ఎలాంటి అప్ డేట్స్ ఇవ్వకుండా గుట్టుచప్పుడు కాకుండా షూటింగ్ కానిచ్చేస్తున్నారు. డిసెంబర్ లోపు పూర్తి చేయాలనే టార్గెట్ ఉంది కాబట్టి విలన్ తో పాటు హీరోయిన్స్ సెలక్షన్ కూడా చాలా సైలెంట్ గా తెరవెనుక కానిస్తున్నట్టు సమాచారం. ఇకపోతే ఇందులో బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ విలన్ గా చేయడం గురించి గత కొద్ది రోజులుగా చాలా వార్తలు ప్రచారం లోకి వచ్చాయి.
కాని అజయ్ ఒప్పుకోలేదని తనకు రాని భాషల్లో నటించలేనని చెప్పాడని ఏదేదో టాక్ వచ్చింది. అందులో నిజం లేకపోలేదు. శంకర్ కమల్ హాసన్ తో తీస్తున్న ఇండియన్ 2 కి అడిగినప్పుడు అజయ్ దేవగన్ ఈ కారణం చెప్పే నో అన్నాడు. అయితే రాజమౌళి ఆఫర్ కు మాత్రం పూర్తిగా కాదు అనలేదని ఫ్రెష్ అప్ డేట్. అదేంటి అని ఆశ్చర్యపోకండి. ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్ ఉంది. ఇప్పటికే ఉన్న కమిట్ మెంట్స్ కారణంగా మెయిన్ రోల్ చేయలేడు కాబట్టి రాజమౌళి చాలా తెలివిగా కీలకమైన ఒక క్యామియోను అజయ్ దేవగన్ కు ఆఫర్ చేసాడట.
కథలో పెద్ద ట్విస్ట్ ఇచ్చే ఆ పాత్ర కనిపించేది కొన్ని నిమిషాలే అయినప్పటికీ ప్రేక్షకులకు గుర్తుండిపోతుందట. దానికి గాను రెండు మూడు రోజులు కాల్ షీట్స్ ఇస్తే చాలని చెప్పడంతో అజయ్ దేవగన్ చేయడం దాదాపు పక్కా అని బాలీవుడ్ టాక్. తను ఒప్పుకోవడానికి మరో కారణం కూడా ఉంది. అజయ్ దేవగన్ రాజమౌళిల పరిచయం ఇప్పటిది కాదు. ఈగ హిందీ వెర్షన్ కు డబ్బింగ్ చెప్పింది అజయే. అప్పటి నుంచి ఇద్దరి మధ్య మంచి బాండింగ్ ఉంది. సో ఆర్ ఆర్ ఆర్ లో అజయ్ దేవగన్ కనిపించడం పక్కా అని తెలిసింది. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది