అందుకే ఆ బ్యూటీ తెలుగు సినిమా చేయదట!

Update: 2020-03-24 23:30 GMT
మన టాలీవుడ్ లో పరాయి భాషల భామలకు ఎంతో ప్రాధాన్యత ఇస్తారనే సంగతి మనకే కాదు ఇండియా అంతా తెలుసు. అందుకే పంజాబ్ నుంచి తమిళ నాడు దాకా అందరూ హైదరాబాద్ ఫ్లైట్ ఎక్కేందుకు ఉత్సాహపడుతుంటారు. నిజానికి సగం మంది బాలీవుడ్ హీరోయిన్లు తెలుగులో నటించి ఉంటారు. ప్రస్తుతం బాలీవుడ్ లో భారీ డిమాండ్ ఉన్న ఓ హాటీ కూడా తెలుగులో రెండు సినిమాల్లో నటించింది. అయితే ఆ సినిమాల తర్వాత తెలుగు ఆఫర్లు వస్తున్నా నో నో నో నో అంటూనే ఉందట.

ఇలా ఎందుకు నో చెప్తోంది? మన నిర్మాతలు భారీ పారితోషికం ఇస్తారు.. అన్నీ వసతులు కల్పిస్తారు కదా.. మరెందుకు టాలీవుడ్ కు రాను అంటోంది? ఈ విషయం ఆరా తీస్తే ఆసక్తికరమైన సంగతులు బయటకు వచ్చాయి. నిజానికి ఉత్తరాది హీరోయిన్లు మన సౌత్ బడా నిర్మాతలకు అన్ని విషయాలలో 'అనుకూలంగా' ప్రవర్తిస్తారట. అయితే ఆ కంఫర్ట్ అనేది ఇచ్చిపుచ్చుకునే ధోరణిపైనే ఆధారపడి ఉంటుంది. చాలామంది హీరోయిన్లు ఇలా ఇచ్చిపుచ్చుకుంటూ కెరీర్ కొనసాగిస్తారట. కానీ ఈ భామ విషయంలో మొదట ఇస్తామని చెప్పిన పారితోషికం ఇవ్వకుండా తక్కువే ముట్టజెప్పి సరిపెట్టుకోమంటున్నారట.

ఒక్క పారితోషికం విషయంలోనే కాకుండా ఇతరత్రా ఇబ్బందులు కూడా ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉండడంతో లేనిపోనీ ఇబ్బందులు ఎందుకనే ఆలోచనతో టాలీవుడ్ వైపుకు చూడడం లేదట. ఈ ఒక్క హీరోయిన్ విషయంలోనే కాదు గతంలో మరో బాలీవుడ్ భామ కూడా టాలీవుడ్ లో ఇలా మెరిసి అలా మాయమై ముంబైలో సెటిల్ కావడానికి ఇలాంటి పరిస్థితులే కారణమట. ఏదైతేనేం.. కొందరు తమ జఫ్ఫా ప్రవర్తనతో జిలేబీల లాంటి ముంబై భామలను తెలుగు ప్రేక్షకులకు దూరం చేస్తున్నారు!




Tags:    

Similar News