ఇవేం ఫేసులు.. ప‌నికొస్తాయా అన్నారు

Update: 2019-09-16 06:41 GMT
క‌థానాయిక అవ్వాలంటే అర్హ‌త ఏమిటి? అందం-అభిన‌యం-వాచ‌కం- శ‌రీర‌భాష ఇవ‌న్నీ చాలా ముఖ్యం. ఇవ‌న్నీ టాప్ మోడ‌ల్స్ కి ఉన్న అర్హ‌త‌లా? అంటే కాద‌ని ప్రూవైంది. అందుకే ముంబై నుంచి వ‌చ్చే క్యాట్ వాక్ మోడ‌ల్స్ అంద‌గ‌త్తెలే అయినా పోటీ బ‌రిలో లోక‌ల్ అంద‌గ‌త్తెలు దూసుకొస్తున్నారు. ముఖ్యంగా ముంబై- చెన్న‌య్- దిల్లీ భామ‌ల‌కు మ‌ల్లూ భామ‌ల నుంచి తీవ్ర‌మైన పోటీ నెల‌కొంది. అభిన‌యంలో ఈ భామ‌ల్ని కొట్టేవాళ్లు లేర‌న్న పేరొచ్చేయ‌డ‌డంతో వీళ్ల డామినేష‌న్ అంతే ఇదిగా క‌నిపిస్తోంది. అయితే అందంతో కాకుండా ట్యాలెంట్ తో నెగ్గుకొచ్చే క‌థానాయిక‌ల్ని స‌ప‌రేట్ గా చూడాల్సి ఉంటుంది. ఆ కోవ‌లో సాయి ప‌ల్ల‌వి - హెబ్బా ప‌టేల్- కృతి స‌నోన్ వంటి భామ‌ల పేర్లు ఉన్నాయి. వీళ్ల‌తో పాటే రేసులోకి  ప్రియాంక అరుల్ మోహన్ అనే కొత్త పేరు వ‌చ్చి చేరింది.

అయితే ఈ భామ‌లంతా ఆరంభం కొన్ని విమ‌ర్శ‌ల్ని ఎదుర్కొన్నారు. అస‌లు వీళ్లేం క‌థానాయిక‌లు అంటూ పెద‌వి విరిచేశారు జ‌నం. చూడ‌గానే ఫ‌స్ట్ ఇంప్రెష‌న్ ని ద‌క్కించుకోవ‌డంలో ఫెయిల‌య్యారు. కుమారి 21ఎఫ్ చిత్రంతో ముంబై బొమ్మ హెబ్బా ప‌టేల్ తెలుగు ప‌రిశ్ర‌మ‌కు ప‌రిచ‌య‌మైంది. అయితే త‌న‌ లుక్ బాలేదన్నారు. సుకుమార్ సెల‌క్ష‌న్ ని వేలెత్తి చూపించారు. క‌ట్ చేస్తే కుమారి 21ఎఫ్ రిలీజ‌య్యాక అర్థ‌మైంది. విమ‌ర్శించిన నోళ్లే వ్వావ్ అంటూ నోరెళ్ల‌బెట్టాయి. సుక్కూనా మ‌జాకానా అన్నారు. అలాగే మ‌హేష్ లాంటి సూప‌ర్ స్టార్ స‌ర‌స‌న మ‌రో ముంబై బ్యూటీ కృతి స‌నోన్ ని ఎంపిక చేసిన‌ప్పుడు జ‌నం పెద‌వి విరిచేశారు. చూడ‌టానికి మ‌రీ అంత గొప్ప‌గా ఏం లేదు.. అస‌లేంటి సుక్కూ టేస్ట్! అంటూ విరుచుకుప‌డ్డారు. 1 నేనొక్క‌డినే రిలీజ్ త‌ర్వాత అంతా గ‌ప్ చుప్. కృతి న‌ట‌న‌కు వంద‌కు వంద మార్కులు వేశారు క్రిటిక్స్.

అప్ప‌ట్లో ప్రేమ‌మ్ సినిమాతో సాయిప‌ల్ల‌వి ప‌రిచ‌యం అయ్యింది. లుక్ ప‌రంగా యావ‌రేజ్.. రొటీన్ ఫిగ‌ర్.. అన్నారు. కానీ సినిమా రిలీజ్ త‌ర్వాత‌ చించి ఆరేసిందన్నారు. ఆ త‌ర్వాత సౌతిండస్ట్రీ మొత్తం సాయిప‌ల్ల‌విని నెత్తిన పెట్టుకుంది. వ‌రుస బ్లాక్ బ‌స్ట‌ర్ల‌తో అమ్మ‌డు మోతెక్కిస్తోంది. అస‌లు సాయి ప‌ల్ల‌వి ట్యాలెంటు ఎంత‌? అంటే రౌడీ పిల్ల‌గా.. అల్ల‌రి భానుమ‌తిగా గుండెల్లో ఉండిపోయింది. తాను ఏ సినిమాలో న‌టించినా త‌నే ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ అన్నంత‌గా పేరు తెచ్చుకుంది. త‌న‌కోస‌మే ఇప్పుడు క‌థ‌లు పుడుతున్నాయంటే అర్థం చేసుకోవ‌చ్చు.

నేచుర‌ల్ స్టార్ నాని న‌టించిన‌ `గ్యాంగ్ లీడర్`తో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ప్రియాంక అరుల్ మోహన్ పైనా ఆరంభం విమ‌ర్శ‌లొచ్చాయి. అస‌లు హీరోయిన్ ఫిగ‌ర్ కానే కాదు అని విమ‌ర్శించారు. క‌ట్ చేస్తే సినిమా రిలీజైంది. క్రిటిక్స్ ప్రియాంక న‌ట‌న‌ను ప్ర‌త్యేకించి కోట్ చేస్తూ బెస్ట్ గా న‌టించేసింది అంటూ పొగిడేశారు. విక్ర‌మ్.కె న‌ట‌న‌కు ఆస్కారం ఉన్న‌ పాత్రను ఇవ్వడంతో పెర్ఫార్మెన్స్ అద‌ర‌గొట్టింద‌న్న పేరొచ్చింది. అమాయ‌క‌త్వం క‌ల‌గ‌లిసిన పాత్ర‌లో మైమ‌రిపించింద‌ని క్రిటిక్స్ ప్ర‌శంసించారు. ప్ర‌స్తుతం ఈ పక్కింట‌మ్మాయికి ఆఫ‌ర్లు వెల్లువెత్తుతున్నాయిట‌. ఆ మాట‌కొస్తే.. నివేద థామ‌స్ ఏమైనా గొప్ప అంద‌మైన ఫిగ‌రా? స‌న్న‌జాజి ఇలియానా న‌డుము ఏమైనా ఉందా? కానీ త‌న న‌ట‌న‌.. స్పార్క్.. వేదిక‌ల‌పై మాట్లాడుతూ మ‌న‌సును హ‌త్తుకునే తెలివితేట‌లు ఇవ‌న్నీ త‌న‌కు పెద్ద ప్ల‌స్ అయ్యాయి. మ‌ల్లూ బేబి నివేథ అంటే ప‌డి చ‌చ్చిపోయే నిర్మాత‌లున్నారంటే అర్థం చేసుకోవ‌చ్చు.

దీనిని బ‌ట్టి క‌థానాయిక‌గా రాణించాలంటే అందం ఒక్క‌టే స‌రిపోదు. న‌ట‌న చాలా ముఖ్యం. ఆర్జీవీ చెప్పిన‌ట్టు ముఖాభిన‌యానికి చాలా చాలా ప్రాధాన్య‌త ఉంది. ఒంపుసొంపుల ఖిల్లా ఒంటి నిండా లేక‌పోయినా కొన్ని ప్ర‌త్యేక క్వాలిటీస్ తో బండి లాక్కొచ్చేయొచ్చు! అన్న‌ది ప్రూవైంది.


Tags:    

Similar News