వరుస ఫెయిల్యూర్స్ తో బాలీవుడ్ క్రైసిస్ లో ఉన్న సంగతి తెలిసిందే. అగ్రహీరోల సినిమాలేవీ సరిగా ఆడకపోవడం బాలీవుడ్ ని తీవ్రంగా ఇబ్బందుల్లోకి నెట్టింది. ఇలాంటి సమయంలో ఓ నలుగురు స్టార్లు మాత్రమే పరిశ్రమకు మళ్లీ కొత్త కళ తేగలరని సరైన బ్లాక్ బస్టర్ ఇచ్చి అందరినీ ఆదుకుంటారని విశ్లేషిస్తున్నారు. ఇటీవలే విడుదలైన రణబీర్- బ్రహ్మాస్త్ర విజయం అందుకున్నా కానీ బడ్జెట్ పరంగా కాస్ట్ ఫెయిల్యూర్ అన్న విమర్శలు ఉన్నాయి. అందువల్ల ఇప్పుడు బాలీవుడ్ కి నిజాయితీతో కూడుకున్న బ్లాక్ బస్టర్ అవసరం అన్న వాదనా వినిపిస్తోంది. అయితే పరిశ్రమను ఆదుకోగలిగే ఆ నలుగురు ఎవరు? అంటే కచ్ఛితంగా ఖాన్ ల త్రయం పేర్లు జాబితాలో ఉన్నాయి. వీళ్లతో పాటు టాలీవుడ్ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పేరును బాలీవుడ్ మీడియాలు జాబితాలో చేర్చాయి.
సల్మాన్ ఖాన్ ఇటీవల కొన్ని వరుస డిజాస్టర్లతో ఇబ్బందుల్లో ఉన్నాడు. తదుపరి 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' చిత్రంతో బ్లాక్ బస్టర్ కొట్టి రేస్ లో దూసుకు రావాలని కసిగా ఉన్నాడు. 'కిసీ కా భాయ్ కిసీ కి జాన్' లో షెహనాజ్ గిల్- జాస్సీ గిల్- సిద్ధార్థ్ నిగమ్- పాలక్ తివారీ- రాఘవ్ జుయాల్ కూడా కీలక పాత్రల్లో నటించారు. టాలీవుడ్ స్టార్ హీరో వెంకటేష్ దగ్గుబాటి కూడా సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఇది 30 డిసెంబర్ 2022న విడుదల కానుంది. దీంతో పాటు బ్లాక్ బస్టర్ ఫ్రాంఛైజీ మూవీ టైగర్ 3 పైనా అతడికి భారీ హోప్స్ ఉన్నాయి.
కింగ్ ఖాన్ షారూక్ జీరో పరాజయంతో పూర్తిగా డీలా పడిపోయాడు. అంతకుముందు వచ్చిన రెండు సినిమాలు కూడా సరైన ఫలితాన్ని అందించలేదు. నాలుగేళ్లుగా అతడికి సినిమానే లేదు. దీంతో అతడు సౌత్ ఫార్ములాను ప్రతిభను నమ్మి భారీ ప్రయోగం చేస్తున్నాడు. అట్లీ దర్శకత్వంలో జవాన్.. వార్ దర్శకుడితో పఠాన్ చిత్రాలు కమర్షియల్ గా పెద్ద విజయం సాధిస్తాయని .. రాజ్ కుమార్ హిరాణీతో డుంకీ తన బ్రాండ్ విలువను పెంచుతుందని హోప్ తో ఉన్నాడు. ఇవేగాక షారూక్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నాడు. కంబ్యాక్ కోసం కఠోరంగా శ్రమిస్తున్నాడు.
మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ దంగల్ - సీక్రెట్ సూపర్ స్టార్ లాంటి బ్లాక్ బస్టర్లలో నటించాక అమితాబ్ తో భారీ మల్టీస్టారర్ థగ్స్ ఆఫ్ హిందూస్తాన్ బిగ్ డిజాస్టర్ అయ్యింది. ఇటీవలే విడుదలైన లాల్ సింగ్ చడ్డా చిత్రంతో మరో డిజాస్టర్ ని చవి చూడాల్సి వచ్చింది. ఎన్నో ఆశలు పెట్టుకున్న ఈ సినిమా అమీర్ ని తీవ్రంగా నిరాశపరిచింది. ఇలాంటి సమయంలో అతడు రిలాక్స్ డ్ గా స్క్రిప్టుల్ని ఎంచుకుని బ్లాక్ బస్టర్ తో కంబ్యాక్ అవ్వాలని ప్లాన్ చేస్తున్నాడు. అమీర్ కి సరైన స్క్రిప్టు పడితే బాక్సాఫీస్ వద్ద మరో లెవల్లో హవా నడుస్తుందన్నది అందరికీ తెలిసిన వాస్తవం. అందువల్ల అతడి తదుపరి చిత్రంపై అందరిలో ఆసక్తి నెలకొంది.
ఆసక్తికరంగా ఇప్పుడు బాలీవుడ్ కి బిగ్ హోప్ ఇంకేదైనా ఉందా? అన్నది పరిశీలిస్తే... పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ పేరు కూడా జాబితాలో ప్రముఖంగా వినిపిస్తోంది. మ్యాకో మ్యాన్ ప్రభాస్ వస్తే హిందీ బాక్సాఫీస్ కి కొత్త కళ వస్తుందని ఆశిస్తున్నారు. డార్లింగ్ ప్రభాస్ నుంచి రానున్న తదుపరి మూడు సినిమాలు బ్లాక్ బస్టర్లతో సంచలన వసూళ్లు సాధిస్తాయన్న హోప్ ఉంది. సాహో- రాధేశ్యామ్ చిత్రాలతో ఆశించిన విజయాలను అందుకోలేకపోయిన ప్రభాస్ కి ఇప్పుడు సరైన కంబ్యాక్ హిట్ అవసరం. ఇలాంటి సమయంలో వరుసగా మూడు నాలుగు ప్రయోగాత్మక కమర్షియల్ చిత్రాలతో దూసుకొస్తున్నాడు.
తానాజీ దర్శకుడు ఓంరౌత్ తో ఆదిపురుష్ 3డి.. కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సలార్ మ్యాసివ్ హిట్స్ సాధిస్తాయని బాలీవుడ్ లోను చర్చ సాగుతోంది. అలాగే నాగ్ అశ్విన్ - అశ్వనిదత్ బృందంతో కలిసి ప్రభాస్ భారీ ప్రయోగం చేస్తుండడం బాలీవుడ్ ని ఆకర్షిస్తోంది. ఈ సినిమా ఇప్పటివరకూ భారతదేశంలో రాని సరికొత్త జానర్ తో కొత్త పంథాలో రూపొందుతోందని ఇందులో కీలక పాత్ర పోషిస్తున్న దీపిక పదుకొనే కాంప్లిమెంట్ ఇవ్వడంతో దీనికి హిందీ పరిశ్రమలోనూ హైప్ అమాంతం పెరిగింది. ప్రభాస్ నుంచి వరుసగా మూడు సినిమాలు బ్యాక్ టు బ్యాక్ 2023లో విడుదల కానున్నాయి. వీటితో హిందీ బాక్సాఫీస్ కూడా కళకళలాడుతుందని ఆశిస్తున్నారు. ఖాన్ ల త్రయంతో పాటు ప్రభాస్ కి పెద్ద పీట వేసి గౌరవిస్తున్నారు. మరి దీనిని డార్లింగ్ ఏ విధంగా నిలబెట్టుకుంటాడు? అన్నది వేచి చూడాలి.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.