ఫోటో స్టోరి: ప‌బ్బులో కిల్ల‌ర్ గాళ్స్ ఏంటీ దుమారం?

Update: 2022-04-06 03:30 GMT
బాలీవుడ్ లో న‌వ‌త‌రం జోరు ఒక రేంజులో క‌నిపిస్తోంది. ముఖ్యంగా న‌ట‌వార‌సురాళ్ల డామినేష‌న్ అంత‌కంత‌కు పెరిగిపోతోంది. ఇప్ప‌టికిప్పుడు అర‌డ‌జ‌ను మంది న‌ట‌వార‌సులు బాలీవుడ్ లో అదృష్టం ప‌రీక్షించుకోబోతున్నారు. ఇందులో క‌రీనాక‌పూర్ క‌జిన్.. క‌రిష్మా మాజీ భ‌ర్త కుమార్తె కూడా ఉంది. పేరు షానయా కపూర్.. ఈ బ్యూటీ భారీ లెవ‌ల్లో బాలీవుడ్ అరంగేట్రం కోసం సిద్ధంగా ఉంది. ఆమె తన సోషల్ మీడియాల్లో నిరంత‌రం ఫీల‌ర్స్ వ‌దులుతూ మ‌తులు చెడ‌గొడుతోంది. అద్భుతమైన ఫోటోషూట్ల‌తో తన అభిమానులందరినీ ఆకట్టుకునే అవకాశాన్ని ఈ కుర్ర‌బ్యూటీ ఎప్పుడూ వదులుకోదు.

షాన‌యాకు ఇప్ప‌టికే భారీ ఫాలోయింగ్ పెరిగింది. త‌న ఫోటోల‌ను పోస్ట్ చేసినప్పుడల్లా మొదటగా వ్యాఖ్యానించే వారిలో స్నేహితురాళ్లు అనన్య పాండే - సుహానా ఖాన్ ఉన్నారు. ఈ రోజు కూడా షానయ తన తల్లి సూర్యాస్తమయాన్ని ఆస్వాధిస్తున్న ఓ ఫోటోని షేర్ చేయ‌గా.. అనన్య - సుహానా తమ ఉత్సాహాన్ని ఆపుకోలేక‌పోయారు. వెంట‌నే ప్రత్యేకమైన ప్రతిస్పందనతో ఫ్రెండుని ఖుషీ చేశారు. ఇక ఈ ముగ్గురూ క‌లిసి ఔటింగుల‌కు వెళుతూ ప‌బ్ పార్టీల‌కు వెళుతూ కూడా ప‌లుమార్లు కెమెరా కంటికి చిక్కారు. ప‌బ్ లో ఆ ముగ్గురూ సెల‌బ్రేట్ చేస్తున్న ఓ ఫోటో ఇప్ప‌టికే అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది.

ఈ ఫోటోతో పాటు ప‌లు ఫోటోల‌ను సాన‌య షేర్ చేసింది. ఈ ఫోటోల్లో షానాయ కపూర్ తల్లి మహీప్ కపూర్ ఎడారి నేపథ్యం లో నిలబడి క‌నిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో అస్తమించే సూర్యుడు చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఫోటోలో మహీప్ పూర్తిగా తెల్లటి దుస్తులలో నిల్చుని క‌నిపించారు.ఆమె తెల్లటి షార్ట్ - తెల్లటి క్రాప్ టాప్ ధరించింది. ఈ చిత్రాన్ని పంచుకుంటూ షానయ ఇలా రాశారు. నువ్వు ఎక్కడ ఉన్నా సరే సూర్యుడు ప్రకాశిస్తాడు .. అని వ్యాఖ్య‌ను జోడించింది. దీనిపై స్పందించిన సుహానా ఖాన్ మూడు ఎల్లో హార్ట్ ఎమోజీలను పోస్ట్ చేసింది.  మరోవైపు అనన్య పాండే ఇలా రాశారు, ``ఒకప్పుడు అది మీకు నా క్యాప్షన్``.. దీనికి షానయ బదులిచ్చారు, “@అనన్యపాండే నిజంగా అది మీకు చాలా స్వీట్ గా ఉందా?! ఏమి జరిగిందో ఏమిటో! అని వ్యాఖ్యానించ‌గా.. దీనిపై అనన్య, “@shanayakapoor02 ur బర్త్‌డేకి వేరే కారణం అనుకోవచ్చు`` అని బదులిచ్చారు. చ‌క్క‌న‌మ్మ‌ల న‌డుమ స‌ర‌దా సంభాష‌ణ‌లు ఆక‌ట్టుకున్నాయి.

కెరీర్ మ్యాట‌ర్ కి వ‌స్తే.. సుహానా ఖాన్ తన OTT అరంగేట్రం కోసం వేచి చూస్తోంది. జోయా అక్తర్  తదుపరి చిత్రంలో న‌టిస్తోంది. ఇది ప్రసిద్ధ కామిక్స్ ఆర్చీస్ ఆధారంగా రూపొందుతోంది. ఆమెతో పాటు ఖుషీ కపూర్ - అగస్త్య నంద కూడా తెరంగేట్రం చేయనున్నారు. అనన్య పాండే తదుపరి ఖో గయే హమ్ కహాన్ లో సిద్ధాంత్ చతుర్వేది - ఆదర్శ్ గౌరవ్ లతో కలిసి నటించనున్నారు.
Tags:    

Similar News