డార్లింగ్ ప్రభాస్ క్రేజు ఇంతింతై అన్న చందంగా దేశవిదేశాల్లో విస్తరించింది. ఒకే ఒక్క బాహుబలి అతడి స్థాయిని అమాంతం స్థాయిని పెంచింది. ప్రభాస్ ఏం చేసినా జాతీయ మీడియా కన్ను అతడిపై వాలిపోతూనే ఉంది. ప్రస్తుతం అతడు సాహో చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇండియాస్ మోస్ట్ అవైటెడ్ మూవీగా పాపులరైన ఈ హై ఓల్టేజ్ యాక్షన్ చిత్రం ట్రైలర్ నేడు రిలీజైంది. ఈ ట్రైలర్ లో విజువల్ గ్రాండియారిటీ.. యాక్షన్ కంటెంట్.. శ్రద్ధతో లవ్ ఎపిసోడ్స్ అభిమానుల్ని మెప్పించాయి.
నేడు ముంబైలో జరిగిన ట్రైలర్ వేడుకలో డార్లింగ్ ప్రభాస్ కి ముంబై మీడియా నుంచి కొన్ని ఊహించని ప్రశ్నలు ఎదురయ్యాయి. ప్రభాస్ ఈ సినిమాతో ఖాన్ లనే కొట్టేస్తావా(అధిగమిస్తావా)? అంటూ ముంబై మీడియా సూటిగా ప్రశ్నించి ఉక్కిరి బిక్కిరి చేసింది. అయితే ప్రభాస్ మాత్రం తాపీగా ఏమాత్రం తొణికిసలాడకుండా `థాంక్యూ` అంటూ స్మైల్ తో కవర్ చేసేశాడు. ఖాన్ ల విషయంలో డార్లింగ్ ఏమాత్రం వివాదానికి తావివ్వకపోవడం ముంబై మీడియాలో చర్చకు వచ్చింది. దశాబ్ధాల పాటు బాలీవుడ్ ని ఏల్తున్న ముగ్గురు ఖాన్ లను కొట్టే మొనగాడిగా దక్షిణాది స్టార్ ప్రభాస్ అక్కడి వారికి కనిపించడం ఆసక్తి రేకెత్తించే పరిణామమే.
2019లో కొత్త ట్రెండ్ మొదలైంది. బాలీవుడ్ లోనూ మన ట్యాలెంట్ ఏంటో అర్థమవుతోంది. తెలుగు కుర్రాడు సందీప్ వంగ తెరకెక్కించిన `కబీర్ సింగ్` హిందీ బాక్సాఫీస్ వద్ద 2019 నంబర్ వన్ చిత్రంగా నిలిచింది. సల్మాన్ `భారత్` చిత్రాన్ని వసూళ్ల పరంగా వెనక్కి నెట్టి ఆశ్చర్యపరిచింది. ఇక ఇదే ఏడాది ఎన్నో భారీ అంచనాల నడుమ `సాహో` చిత్రం రిలీజవుతోంది. పాన్ ఇండియా కంటెంట్ తో రిలీజవుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుల్ని తిరగరాస్తుందనే అంచనాలు ఏర్పాడ్డాయి.
ఇక హిందీలో ఏదైనా ఒక డైలాగ్ చెప్పండి ప్రభాస్ అంటూ బాలీవుడ్ మీడియా అతడి వెంట పడింది. దానికి కూడా `జై హింద్` అంటూ ప్రభాస్ కవర్ చేసేశారు. మొత్తానికి ముంబై మీడియాని ప్రభాస్ బాగానే మ్యానేజ్ చేసేశారు కానీ.. మరో 20 రోజుల్లో `సాహో` అన్ని అంచనాల్ని అందుకుని ది బెస్ట్ రిజల్ట్ అందుకుంటుందా? అన్నది చూడాలి. సాహో ట్రైలర్ నచ్చినా ఈ సినిమా కథాంశం ఎలా ఉండబోతోంది? అంత గ్రిప్పింగ్ గా సినిమా ఆద్యంతం మలిచారా లేదా? అన్నదానిపైనే `సాహో` రిజల్ట్ ఉంటుందనడంలో సందేహం లేదు.