బాలీవుడ్ కుళ్ళు బయటపడుతోందిగా!

Update: 2019-06-24 04:34 GMT
మొన్న విడుదలైన కబీర్ సింగ్ బాక్స్ ఆఫీస్ దుమ్ము దులిపేసింది. ఇంకా పూర్తి సమాచారం అందలేదు కానీ ట్రేడ్ నుంచి వచ్చిన బేసిక్ రిపోర్ట్స్ ని బట్టి చూస్తే మూడు రోజులకు గాను సుమారు 60 కోట్లకు పైగా వసూళ్లను దాటేసినట్టుగా తెలుస్తోంది. బాలీవుడ్ క్రిటిక్ లోకం ప్లస్ మీడియా కబీర్ సింగ్ మీద ఉద్దేశపూర్వకంగా విమర్శలు గుప్పించినప్పటికీ ప్రేక్షకులు అదేమీ పట్టించుకోవడం లేదు. థియేటర్లు హౌస్ ఫుల్ బోర్డులతో దర్శనమిస్తున్నాయి.

ముఖ్యంగా మల్టీ ప్లెక్సుల్లో టాయ్ స్టోరీ లాంటి హాలీవుడ్ సినిమాలను  తట్టుకుని మరీ కబీర్ సింగ్ హాళ్లను నింపుతున్నాడు. ఇదో తిరుగుబోతు ప్రేమకథని అవసరం తీరడం కోసం బెదిరింపులకు సైకో స్టోరీ అని నానారకాలుగా సదరు క్రిటిక్స్ ఏకంగా సోషల్ మీడియాలో వీడియోలు పోస్ట్ చేయడం విశేషం. షాహిద్ కపూర్ వీటిని ఎదురుకుని కౌంటర్లు ఇస్తున్నాడు కానీ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా మాత్రం సైలెంట్ గా ఉన్నాడు, ఎంత చెప్తే అంత రెచ్చిపోయి చెడు ప్రచారం చేస్తారు కాబట్టి కలెక్షన్ల రూపంలో వాళ్ళకే సమాధానం దొరుకుతుందని మౌనాన్ని ఆశ్రయించాడు.

ఇప్పటికే ఈ ఏడాది బిగ్గెస్ట్ టాప్ త్రి ఓపెనర్స్ లో చేరిపోయిన కబీర్ సింగ్ ఇదే జోరు ఇంకో వారం కొనసాగిస్తే వంద కోట్లు సులభంగా దాటేయవచ్చు. యూత్ కి బాగా కనెక్ట్ అవుతున్న కబీర్ సింగ్ వల్ల ఇప్పుడు మరోసారి అర్జున్ రెడ్డి టాపిక్ రావడం మరో ట్విస్ట్. తెలుగు ఆడియన్స్ టేస్ట్ గురించి కొందరు ముంబై క్రిటిక్స్  చేస్తున్న కామెంట్స్ గురించి నెటిజెన్ల నుంచి ధీటైన కౌంటర్లు పడుతున్నాయి.
Tags:    

Similar News