బాలీవుడ్ లో బంపర్ హిట్ కొట్టిన కంగనా రనౌత్ నటించిన క్వీన్ మూవీని సౌత్ లో రీమేక్ చేసేందుకు రంగం సిద్ధమైన సంగతి తెలిసిందే. దాదాపు ఏడాదిగా ఈ ప్రాజెక్టు గురించిన మాటలు నడుస్తుండగా.. ఇప్పుడు స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తయిపోయింది. తెలుగు.. తమిళ్.. మలయాళం.. కన్నడ భాషల్లో సౌత్ లో క్వీన్ రీమేక్ కానుంది.
అన్ని భాషల్లోనూ నిర్మించేది త్యాగరాజన్ ఒక్కరే. యాక్టర్ కం ప్రొడ్యూసర్ కం డైరెక్టర్ అయిన త్యాగరాజన్.. క్వీన్ ని నాలుగు భాషల్లో తీస్తూ.. ఒక్కో భాషకు ఒక్కో హీరోయిన్ ను ఎంపిక చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. తమిళ్ క్వీన్ లో మిల్కీ బ్యూటీ తమన్నా నటించనుంది. మలయాళంలో ఈ పాత్రను అమలాపాల్ తో చేయించనున్నారు. కన్నడంలో ఈ రోల్ ను పరుల్ యాదవ్ తో చేయించనున్నారు. తెలుగులో ఇంకా ఎవరితో ఈ పాత్ర చేయిస్తారో ఫైనల్ కాలేదు కానీ.. ఒకే సినిమాని ఇలా ఒక్కో హీరోయిన్ తో చేయించడం అంటే.. బాగా ఓవర్ గా ఉంది అనే టాక్ వినిపిస్తోంది.
పరుల్ యాదవ్ మినహాయిస్తే.. తమన్నా అయినా.. అమలాపాల్ అయినా.. అన్ని భాషల్లో తెలిసిన మొహాలే. అలాంటిది.. నాలుగు భాషలకు నలుగురు హీరోయిన్స్ ఎందుకో అర్ధం కాని విషయం. క్వీన్ రీమేక్ నాలుగు భాషల్లోనూ రెండో హీరోయిన్ గా అమీ జాక్సన్ కనిపించనుంది. హీరోయిన్సే కాదు.. భాషభాషకు డైరెక్టర్లు మారిపోవడం విశేషం. తెలుగు క్వీన్ కి అనీశ్ కురువిల్లా.. తమిళ్-మలయాళ భాషల్లో రేవతి.. కన్నడ వెర్షన్ కు ప్రకాష్ రాజ్ డైరెక్షన్ వహించనున్నారు.