ఫోకస్‌: హీరోయిన్‌లే హీరోలయ్యారు

Update: 2015-06-24 17:30 GMT
ఈ ఏడాది ప్రథమార్థం ముగిసినట్టే. బాలీవుడ్‌లో ఫలితం మాటేమిటి? అని ప్రశ్నిస్తే   ట్రేడ్‌ విశ్లేషకుల రిపోర్ట్‌ ఇది. ఈ ఆర్నెళ్లలో 57 సినిమాలు రిలీజై .. 950కోట్ల వసూళ్లు సాధించాయి. గత ఏడాది ప్రథమార్థం 1150 కోట్లుతో పోలిస్తే ఇది చాలా తక్కువే అయినా ఫర్వాలేదనిపించే ఫలితమే. అయితే ఈ ఏడాదిలో స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ ఒక్కడే ప్రథమార్థంలో వచ్చాడు. ఆ ప్రభావం బాక్సాఫీస్‌పై కనబడింది.

స్టార్‌ హీరోలెవరూ రాకపోయినా స్టార్‌ హీరోయిన్ల సినిమాలు బాక్సాఫీస్‌ని కాపాడాయి. హీరోయిన్లే హీరోలుగా చెలరేగిపోయారు. నాయికా ప్రాధాన్యం  ఉన్న సినిమాలే బాక్సాఫీస్‌ గండాన్ని గట్టెక్కించాయి ఇప్పటివరకూ. అందులో ముఖ్యంగా అనుష్క శర్మ, దీపిక పదుకొన్‌, కంగన స్టారాధిస్టార్లుగా వెలిగిపోయారు. పదండి ఓ లుక్కేద్దాం.

అనుష్క శర్మ కథానాయికగా నటించిన ఎన్‌హెచ్‌ 10 బాక్సాఫీస్‌ వద్ద దాదాపు 100కోట్లు వసూలు చేసింది. ఈ చిత్రంతో నటిగానే కాకుండా నిర్మాతగానూ సక్సెస్‌ అందుకుంది అనుష్క. అలాగే దీపిక పదుకొన్‌ ప్రధాన పాత్రలో నటించిన 'పికూ' 79కోట్లు పైగా వసూలు చేసింది. ఈ చిత్రంలో నటనకు దీపిక విమర్శకుల ప్రశంసలందుకుంది. అలాగే క్వీన్‌ కంగన తను వెడ్స్‌ మను రిటర్న్స్‌తో పెద్ద విజయం అందుకుంది. 150కోట్లు పైగా వసూళ్లు దక్యాయంటే కంగన అభినయానికి అభిమానులు గులాం అయ్యారు కాబట్టే. అలాగే ప్రియాంక చోప్రా, షఫాలీ శర్మ, అనుష్క శర్మ నాయికలుగ వచ్చిన దిల్‌ దడ్కనే దో చిత్రం ఓ మోస్తరు విజయం సాధించి రూ.72కోట్లు వసూలు చేసింది.

ఏడాది ఆరంభంలో బద్లాపూర్‌ హిట్‌ కొట్టింది. ధమ్‌ లగాకే హైసా చిత్రం ఈ ఏడాది సినిమాల్లో నూతన ఒరవడి సృష్టించింది. లావుపాటి అమ్మాయి భూమి ఫడ్నేకర్‌ నాయికగా నటించి ఆకట్టుకుంది. కల్కి కొచ్లిన్‌ 'మార్గరిటా విత్‌ ఎ స్ట్రా' చిత్రంలో సెరిబ్రల్‌ పాల్సీతో బాధపడే యువతిగా అభినయించింది. ఈ సినిమా బాక్సాఫీస్‌ వద్ద హిట్టయ్యింది. భారీ అంచనాలతో వచ్చిన బాంబే వెల్వెట్‌, ఎబిసిడి 2 ఫలితాలు తారుమారయ్యాయి. సుశాంత్‌ సింగ్‌ రాజ్‌పుత్‌సింగ్‌ నటించిన డిటెక్టివ్‌ బ్యోమకేష్‌ భక్షి ఫర్వాలేదనిపించింది.

బీబత్సమైన ఫ్లాప్స్‌ కూడా బలే ఉన్నాయిలే. దక్షిణాది రీమేక్‌ తేవర్‌ (ఒక్కడు) ఫ్లాప్‌. ఠాగూర్‌ రీమేక్‌ 'గబ్బర్‌ ఈజ్‌ బ్యాక్‌' ఫర్వాలేదనిపించింది. ఈ చిత్రం 86కోట్లు వసూలు చేసింది. ఐ అనువాద చిత్రం ఫ్లాప్‌.

ఇక కొరియన్‌ సినిమా ఇన్‌స్పిరేషన్‌తో తెరకెక్కించిన అలోన్‌  ఫ్లాప్‌ సినిమాగా నిలిచింది. ఇన్‌స్పిరేషన్‌త తీసిన సినిమా ఫ్లాప్‌. ఇమ్రాన్‌ హస్మి మిస్టర్‌ ఎక్స్‌ ఫ్లాప్‌. అక్షయ్‌, రానాల బేబి హిట్‌ చిత్రంగా నిలిచింది. 95కోట్లు వసూలు చేసింది. డర్టీ పాలిటిక్స్‌, షమితాబ్‌ చిత్రాలు ఆకట్టుకోలేదు. కుచ్‌ కుచ్‌ లోచా హై ఫ్లాపైనా ఏక్‌ పహేలీ లీలా హిట్టయ్యింది.

ఆ విధంగా బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ నడిచింది. ఇక తరువాత టాలీవుడ్‌ సంగతి చూద్దాం.



Tags:    

Similar News