గత కొంత కాలంగా బాలీవుడ్ తీవ్ర గడ్డు పరిస్థితుల్ని ఎదుర్కొంటోంది. కోవిడ్ తరువాత బాలీవుడ్ పరిస్థితి మరీ దారుణంగా మారింది. ఏ స్టార్ సినిమా చేసినా గతలంఓ బాక్సాఫీస్ వద్ద కోట్ల వర్షం కురిసేది కానీ ఇప్పడు ఆ పరిస్థితి కనిపించడం లేదు. బాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించిన అమీర్ కాన్, అక్షయ్ కుమార్, కంగన లాంటి స్టార్స్ చేతులు ఎత్తేశారు. వీరు నటించిన సినిమాలేవీ బాక్సాఫీస్ వద్ద ఆకట్టుకోలేకపోయాయి.
భారీ డిజాస్టర్ లుగా నిలిచాయి. అమీర్ ఖాన్ నటించిన `లాల్ సింగ్ చడ్డా`, కంగన నటించిన `ధాకడ్`, అక్షయ్ కుమార్ నటించిన `సమ్రాట్ పృథ్వీరాజ్` వంటి సినిమాలు, రణ్ బీర్ కపూర్ `శంషేరా` భారీ డిజాస్టర్ లుగా నిలిచి బాలీవుడ్ మేకర్స్ కి షాకిచ్చాయి. అక్షయ్ కుమార్ నటించిన `సమ్రాట్ పృథ్వీరాజ్` ప్రేక్షకులు లేక షోలే క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి తలెత్తిందంటే బాలీవుడ్ స్టార్ హీరోల పరిస్థితి ఎంత దారుణంగా మారిందో అర్థం చేసుకోవచ్చు.
ఇలాంటి సమయంలో కార్తీక్ ఆర్యన్ నటించిన `భూల్ భులాయ్యా 2` అనూహ్య విజయాన్ని సాధించి ఈ మధ్య కాలంలో విడుదలైన సినిమాల్లో హయ్యెస్ట్ గ్రాసర్ గా నిలిచింది. 2007లో దక్షిణాది మూవీ `చంద్రముఖి` ఆధారంగా తెరకెక్కిన ``భూల్ భులాయ్యా `కిది సీక్వెల్ కావడం గమనార్హం. ఈ మూవీ తరువాత రణ్ బీర్ కపూర్ నటించిన `బ్రహ్మాస్త్ర` ఫరవాలేదని పించినా ఈ స్థాయిలో టాక్ ని మాత్రం సొంతం చేసుకోలేకపోయింది.
ఈ నేపథ్యంలో బాలీవుడ్ ని ఆదుకునేది ఎవరు? మళ్లీ పూర్వ వైభవాన్ని అందించేది ఎవరు? అనే చర్చ బాలీవుడ్ లో మొదలైంది. ఈ నేపథ్యంలో అజయ్ దేవగన్ దక్షిణాది సూపర్ హిట్ ఫిల్మ్ `దృశ్యం 2` రీమేక్ తో ప్రేక్షకుల ముందుకొచ్చాడు. టాబు, శ్రియ కీలక పాత్రల్లో నటించిన ఈ మూవీ బాలీవుడ్ లో కొత్త ఆశల్ని చిగురింపజేస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లని సాధిస్తోంది. ఇంత వరకు ఏ మిందీ సినిమాకు అందించని ఆదరణని ఈ మూవీకి అందిస్తుండటం విశేషం.
బాలీవుడ్ కు అవసరమైన టైమ్ లో సీనియర్ హీరో అజయ్ దేవగన్ `దృశ్యం 2`లో బ్లాక్ బస్టర్ హిట్ ని సొంతం చేసుకోవడం విశేషం. తొలి రోజు రూ. 15. 38 కోట్ల గ్రాస్ ని రాబట్టిన ఈ మూవీ ఆ తరువాత కూడా అదే జోరుని కంటిన్యూ చేస్తూ వసూళ్ల సునామీ సృష్టిస్తోంది. ఆదివారం హౌస్ ఫుల్స్ తో రన్నవుతూ మౌత్ టాక్ తో సంచలనం సృష్టిస్తోంది.
మొదటి వారంతంలో రూ. 64.14 కోట్లని రాబట్టింది. దీంతో ఈ వారంలో ఈ మూవీ రూ. 100 కోట్ల మార్కుని అవలీలగా దాటే అవకాశం వుందని తెలుస్తోంది. దక్షిణాది రీమేక్ సినిమాతో బాలీవుడ్ కు అజయ్ దేవగన్ కొత్త ఊపిరులు ఊదుతుండటంతో నెటిజన్ లు బాలీవుడ్ కు ఫైనల్ గా మన రీమేక్ లే ఊపరి పోస్తున్నాయని కామెంట్ లు చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.