వర్థమన నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య వెనక కారణమేమిటి? అతడు డిప్రెషన్ లోకి వెళ్లడానికి ముందు అసలేం జరిగింది? బాలీవుడ్ అనే పాము-నిచ్చెన ఆటలో అతడిని పాము మింగేసిందా? అందుకే ఓటమి పాలయ్యాడా? అగ్ర బ్యానర్ల అహంకారం.. కుట్రలు.. నటవారసులు గుత్తాధిపత్యం చెలాయించే చోట పరిశ్రమ బయటి వ్యక్తిగా అతడు ఆట ఆడలేకపోయాడా? అతడు చదరంగంలో పావుగా మారాడా? ఒంటరివాడిని చేసి పరిశ్రమ కావాలనే తొక్కేసిందా? బయటి వాడికి ఇక్కడ అవకాశం లేదు అంటూ పదే పదే వంచనకు గురి చేసి అతడిని విసిరేసారా? అందుకే అతడు తీవ్ర అశాంతికి.. అసహనానికి గురై ఒత్తిడిలోకి వెళ్లిపోయాడా? అందుకేనా ఈ ఆత్మహత్య? అంటే.. వీటన్నిటికీ సమాధానమిదిగో..
సుశాంత్ ఆత్మహత్య వెనక కారణాల్ని రకరకాల కోణాల్లో అన్వేషించాల్సి ఉంటుంది. అయితే ఇలాంటి ప్రతిభావంతులకు బాసటగా నిలిచేందుకు.. ఇండస్ట్రీలో బలవంతులైన నెప్టోయిజం రాజకీయాలకు బలవ్వకుండా కాపాడేందుకు ప్రారంభించిన బాలీవుడ్ ప్రివిలేజ్ క్లబ్ (ప్రత్యేక హక్కు క్లబ్) సుశాంత్ విషయంలో ఎందుకు విఫలమైంది? అన్న సందేహాలు కలగక మానవు. భారతదేశం నలుమూలల నుండి బయటి వ్యక్తులు తమ కలలను సాకారం చేసుకోవడానికి వచ్చినప్పుడు వారికి అవకాశాలు దక్కేలా చేయడం దీని విధి. కానీ సఫలమైందా? అంటే దానికి ఆన్సర్ లేదు.
బాలీవుడ్ లో నటవారసుల్ని కాపాడుకునేందుకు లేదా ఒక వర్గాన్ని కాపాడేందుకు రకరకాల కుట్రలు కుయుక్తులు పన్నే ఒక వలయం నిర్మించబడి ఉందా? అంటే అవుననే పలువురు సుశాంత్ కొలీగ్స్ విశ్లేషిస్తున్నారు. సుశాంత్ ఆత్మహత్య అనంతరం ట్విట్టర్ సహా సామాజిక మాధ్యమాల్లో బాలీవుడ్ ప్రముఖులు చేసిన వ్యాఖ్యానాలు సంచలనంగా మారాయి. బాలీవుడ్ అనే చదరంగంలో ఆట ఆడడం తెలియని వాళ్లు ఒంటరివాళ్ల బతుకులు ఇలానే అర్థాంతరంగా ముగిసిపోతాయని.. లేదా బయటికి గెంటి వేయబడతారని పలువురు వ్యాఖ్యానించారు. సుశాంత్ సైతం ఒకానొక సందర్భంలో ఓ ఇంటర్వ్యూలో బాలీవుడ్ లో తనకు గాడ్ ఫాదర్ లేరని ఏదో ఒకరోజు తనని గెంటి వేస్తారని వ్యాఖ్యానించడం అప్పట్లో సంచలనమే అయ్యింది.
అంతెందుకు వరుస విజయాలతో 50 శాతం సక్సెస్ రేటు కలిగి ఉన్న సుశాంత్ ఇటీవల ఏకంగా ఏడు అవకాశాలు కోల్పోయాడట. చిచ్చోరే లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఇలా జరిగింది! అంటే అర్థం చేసుకోవచ్చు. ఇంతకుముందు సంజయ్ లీలా భన్సాలీ `రామ్ లీలా`.. మరో స్టార్ డైరెక్టర్ ఆదిత్య చోప్రా బేఫికర్ లో సుశాంత్ సింగ్ హీరోగా ఎంపికై ఆ తర్వాత రణవీర్ సింగ్ తో రీప్లేస్ చేయడం అప్పట్లో హాట్ టాపిక్ అయ్యింది. ఆ రెండు అవకాశాలు కోల్పోవడం వెనక తనపై కుట్ర జరిగిందని సుశాంత్ ఆవేదన చెందిన సందర్భాలున్నాయి. బాలీవుడ్ అనే గదిలో తనకు మరింత చోటు దక్కుతుందని వైశాల్యం పెరుగుతుందని వ్యాఖ్యానించాడంటే.. అతడు ఎంతటి ఇరుకు గదిలో ఉన్నాడో అర్థం చేసుకోవచ్చు.
కాఫీ విత్ కరణ్ లాంటి షోల్లో స్టార్ల వారసులకు ఇచ్చే ప్రాముఖ్యత బయటి వాళ్లకు ఉంటుందా? అంతగా ప్రతిభ లేని వారికి కూడా ఇలాంటి టీవీ షోల్లో పాపులారిటీ పెంచే ప్రయత్నం జరుగుతుంది. ఇంత చేస్తే అంత చేసే ప్రవృత్తి పరిశ్రమలో ఉంది. పరిశ్రమ సంతానానికి తప్ప ఇంకెవరూ కొత్తవారు ఇక్కడ ఎదగకూడదు. అలాంటి చోట సుశాంత్ ప్రజాదరణ అసాధారణమైనది. అతను బీహార్ నుండి ఇంజనీరింగ్ వృత్తిని విడిచిపెట్టాడు, బ్యాక్ గ్రైండ్ డ్యాన్సర్ గా కెరీర్ ప్రారంభించి టీవీ రంగంలో రాణించి అటుపై పెద్ద తెరపైనా అజేయంగా కెరీర్ సాగించాడు.
ఆరు సంవత్సరాల అతని సంక్షిప్త బాలీవుడ్ కెరీర్ పరిశీలిస్తే... 2013 లో అర్బన్ మల్టీప్లెక్స్ హిట్ కై పో చే నుండి.. అతని చివరి విడుదల వరకు.. గత సంవత్సరం బంపర్ హిట్ చిచోర్ వరకూ బంపర్ హిట్లు కొట్టాడు. ఆ క్రమంలనే పరిశ్రమలో సుశాంత్ పై ఏదో కుట్ర జరిగిందని గుసగుసలు వినిపించాయి. బాలీవుడ్ లో అతడి విజయాల్ని సహించని కొన్ని శక్తివంతమైన బ్యానర్ లన్నీ అతడిని బహిష్కరించాలని కుట్ర చేశాయన్న గుసగుసలు వేడెక్కించాయి.
సుశాంత్ తన అర్హతకు తగ్గ సినిమాల్లో అవకాశాలు అందుకో లేదని.. బలహీనమైన మనస్సు కారణంగా నిరాశ కారణం గా అతను ఆత్మహత్య చేసుకున్నాడు అనే వాదనను క్వీన్ కంగన రనౌత్ తిప్పికొట్టారు. బాలీవుడ్ లో రకరకాల కుట్ర కోణాలపైనా సందేహం వ్యక్తం చేశారు. సెల్ఫ్ మేడ్ క్వీన్ గా అది తాను అనుభవించినదేనని గుర్తు చేశారు. సుశాంత్ చివరి కొన్ని పోస్టులను చూస్తే అతడు బలహీన మనసు కలిగిన వాడు అని చెప్పలేం. అతను స్పష్టంగా చెబుతున్నాడు.. ``నా సినిమాలు చూడండి. నాకు గాడ్ ఫాదర్ లేదు. నన్ను పరిశ్రమ నుండి బయటకు గెంటేస్తారు`` అని తన ఇంటర్వ్యూలలో చెప్పాడు. పరిశ్రమ అతన్ని ఎందుకు అంగీకరించడం లేదనే ఆవేదనను సుశాంత్ వ్యక్తం చేశారు. కాబట్టి నేటి ఆత్మహత్య సంఘటన కు పునాది ఏమిటో అర్థం చేసుకోవాలి. సుశాంత్ చిత్రాలకు ఎప్పుడూ సరైన గుర్తింపు పొందలేదు. కేదార్ నాథ్ -చిచోర్ -ఎంఎస్ ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ చిత్రాలకు అవార్డులు లేవు. గల్లీ బాయ్ వంటి చిత్రాలకు అన్ని అవార్డులు వచ్చాయి అంటూ కంగన తిట్టి పోశారు ఒక రకంగా.
చిచోర్ విజయవంతం అయినప్పటికీ.. సుశాంత్ ఏడు చిత్రాలను కోల్పోయాడని ప్రముఖ రాజకీయ నాయకుడు సంజయ్ నిరుపమ్ ట్వీట్ చేయడాన్ని బట్టి బాలీవుడ్ లో కుట్రల్ని అర్థం చేసుకోవచ్చు. అతను కేవలం ఆరు నెలల్లోనే సినిమాలను కోల్పోయాడు. ఎందుకు? పరిశ్రమ క్రూరత్వం ఇది. ఆ క్రూరత్వం ప్రతిభావంతులైన వ్యక్తి ప్రాణాలను తీసింది`` అని నిరుపమ్ పోస్ట్ చేశారు. బుల్లితెర నుండి పెద్ద స్క్రీన్ వరకు సుశాంత్ ప్రయాణాన్ని చూసినప్పుడు ఆ సంగతి స్పష్టమవుతోంది.
2013 లో కై పో చే నుండి 2019 లో చిచోర్ వరకు, సుశాంత్ తొమ్మిది పెద్ద స్క్రీన్ విడుదలలను కలిగి ఉన్నాడు. కై పో చే- పీకె- ఎం.ఎస్. ధోని: ది అన్‌టోల్డ్ స్టోరీ- చిచోర్ పూర్తిగా విజయవంతమయ్యాయి, అంటే అతనికి 50 శాతం విజయవంతం ఉంది. చాలా మంది సమకాలీన హీరోల కంటే అతడి సక్సెస్ రేటు చాలా ఎక్కువ. ఇతర ఫ్లాప్ సినిమాలు అతడికి నటుడిగా మంచి పేరునే తెచ్చాయి. కాబట్టి, అతను ప్రాజెక్టులను ఎందుకు కోల్పోయాడు? భన్సాలీ.. ఆదిత్య చోప్రా వంటి ప్రముఖుల బ్యానర్లలో సినిమాల్ని ఎందుకు కోల్పోయాడు? ఇలా ఎన్నో విశ్లేషణలు తెరపైకి వచ్చాయి. సుశాంత్ ని కాదని రణవీర్ కి అవకాశం ఇచ్చారంటే కపూర్ కుటుంబంతో అతడి రిలేషన్ షిప్ వల్లనే అనే వాదనా ఉంది. కొన్నాళ్ల క్రితం సుశాంత్ IANS కి ఇచ్చిన ఇంటర్వ్యూలో.. పరిశ్రమ లోపలికి `కొంచెం పెద్ద గది` లభిస్తుందని ఆశిస్తున్నాను.. కానీ దానిని పట్టించుకోను అని వ్యాఖ్యానించడం ఆసక్తికరం. అంతగా సక్సెస్ లేకపోయినా పరిశ్రమ లోపలి వ్యక్తులకు ఉండే ప్రచారం ప్రోత్సాహం తమలాంటి బయటి నుంచి వచ్చిన వారికి ఉండదనేది సుశాంత్ అనుభవ పూర్వక ఉద్ధేశం. బాలీవుడ్ ప్రివిలేజ్ క్లబ్ అనేది కేవలం కొందరిని కాపాడేందుకు నియమించబడిన సెక్యూరిటీ గార్డా? అన్న సందేహాన్ని పలువురు వ్యక్తం చేయడం ఆశ్చర్యం కలిగిస్తోంది.
``బాలీవుడ్ ప్రివిలేజ్ క్లబ్ తప్పక ఈ విషయంపై గట్టిగా ఆలోచించాలి. నన్ను మరింత వివరించమని అడగవద్దు`` అని సోషల్ మీడియాలో సుశాంత్ మరణించిన తరువాత బాలీవుడ్ ప్రముఖుడు అనుభవ్ సిన్హా ఆవేదనను వ్యక్తం చేశారు. బాలీవుడ్ లో స్వయం నిర్మిత (సెల్ఫ్ మేడ్) ప్రతిభావంతులు వంచనకు గురవుతున్నారు. పరిశ్రమలో చేరాలని కోరుకునే ఇతరులను ఇక్కడ పెద్ద బ్యానర్ల నిర్మాతలు విస్మరిస్తున్నారు. వంచనకు గురైన వారంతా `బాలీవుడ్ గేట్ కీపర్స్` వైపు వేళ్లు చూపించారు. నా భుజాలపై పడి ఏడ్చావు.. నీకు అన్యాయం ఎలా జరిగిందో నాకు తెలుసు. చేసింది ఎవరో తెలుసు! అని సుశాంత్ గురించి శేఖర్ కపూర్ వ్యాఖ్యానించారంటే అర్థం చేసుకోవాలి.
కంగనా నెప్టో వాదనలతో కూడిన వీడియో .. సిన్హా భయంకర వ్యాఖ్యలు.. శేఖర్ కపూర్ సంచలన వ్యాఖ్యలు.. రణవీర్ షోరే.. అలాగే ప్రముఖ హెయిర్‌స్టైలిస్ట్ సప్నా భావ్నాని వంటి దగ్గరి పరిశ్రమ పరిశీలకులు, మ్యాజిక్ ఎంట్రీ పాస్ లేని ఆశావాదులందరికీ బాలీవుడ్ మంచిది కాదని స్పష్టం చేస్తోంది. నాటకాలాడే బాలీవుడ్ గేట్ కీపర్స్ ఆడే ఆట గురించి .. వారి రెండో ముఖం గురించి బయటపెట్టాల్సిన సమయం వచ్చిందని పలువురు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. వ్యాపారంలో వారసత్వంగా పొందిన అధికారం .. ప్రధాన స్రవంతి మీడియా ఒడిలో వాలిపోవడం వల్ల వారు పొందే శక్తి.. ఎవరు స్టార్ అవుతారు? అన్నది నిర్ణయిస్తుంది. కాసినోలో అధిక మెట్ల పట్టికను కలిగి ఉన్న కోటరీని ఎప్పటికీ ప్రశ్నించరు. ఎందుకంటే ప్రతి ఒక్కరూ ఆటను ఆస్వాదించడంలో చాలా బిజీగా ఉంటారు! అన్నది తెలుసుకోవాలి.
గత కొన్ని సంవత్సరాలుగా సుశాంత్ చాలా క్లిష్ఠ కాలాన్ని ఎదుర్కొన్నాడన్నది రహస్యం కాదు. పరిశ్రమలో ఎవరూ అతని కోసం నిలబడలేదు లేదా ఎవరూ అతడికి సహాయం చేయలేదు. ఈ రోజు ట్వీట్ చేయడం పరిశ్రమ నిజంగా ఎంత నిస్సారంగా ఉందో అర్థం చేసుకోవాలి అంటూ సుశాంత్ సన్నిహితురాలైన సాప్నా వ్యాఖ్యానించారు. శేఖర్ కపూర్ తన ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ `పానీ`ని సుశాంత్ తో చేయవలసి ఉంది. ఈ చిత్రానికి ఆదిత్య చోప్రా బ్యానర్ యష్ రాజ్ ఫిల్మ్స్ (వైఆర్ఎఫ్) మద్దతు ఇవ్వాల్సి ఉంది. కానీ ఇవ్వలేదు.
శుద్ధ్ దేశీ రొమాన్స్ - డిటెక్టివ్ బ్యోమకేష్ బక్షి చిత్రాల తరువాత సుశాంత్ కి ప్రఖ్యాత యశ్ రాజ్ ఫిలింస్ (వైఆర్ఎఫ్) నుంచి తప్పుకున్నాడు. ఇది అతని వృత్తిని ప్రభావితం చేసింది. అది ఇతర పెద్ద బ్యానర్ల అవకాశాల్ని రానివ్వకుండా చేసింది. సుశాంత్ పై పరిశ్రమలో దుష్ప్రచారం జరిగింది. తెరవెనక కుట్ర జరిగిందన్నందుకు ప్రూఫ్ లు ఉన్నాయి. ఇవన్నీ అతడిలో వేదనను పెంచాయి.
ప్రముఖ స్టార్ కోయెనా మిత్రా వ్యాఖ్యలు మరో సంచలనం. ``శ్రీ కృష్ణుడు `మహాభారతం`లో ఇలా అన్నాడు. ... `నిశ్శబ్దంగా లేదా తటస్థంగా ఉన్నవారు అధర్మం(పాపులు) వైపు ఉన్నారని భావిస్తారు. మీరు మాట్లాడండి లేదా మీరు కూడా వారిలో ఉన్నారని అంగీకరించండి`` అనేది దానర్థం. ఎంత మంది బయటి వ్యక్తుల అనుభవాలు ఇవి. # నేపోటిజం మరియు # మాఫియా బిజినెస్.. అంటూ తీవ్రంగానే వ్యాఖ్యానించారు. పలువురు ప్రముఖుల వ్యాఖ్యల్ని బట్టి బాలీవుడ్ లో ఎన్నో కుట్రలు వర్థమాననటుడు సుశాంత్ ని ఆత్మహత్యకు ప్రేరేపించాయని అర్థం చేసుకోవచ్చు.