అంబానీ ఇంట పెళ్లి.. ఆ మాత్రం ఉండాల్సిందే..

Update: 2018-07-01 10:56 GMT
అంబానీ ఇంట పెళ్లి మరీ.. ఆ మాత్రం సందడి లేకపోతే ఎలా.. అందుకే బాలీవుడ్ మొత్తం కదిలివచ్చింది. గానా బజానా.. పాటలు - డ్యాన్సులతో బాలీవుడ్ అగ్రహీరోలు సైతం చిందేశారు. ఈ అరుదైన కలయికకు వేదికగా నిలిచింది అకాశ్ అంబానీ ముందస్తు పెళ్లి వేడుక.

భారత్ లోనే నంబర్ 1 ధనవంతుడు ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి సందడి మొదలైంది. ఆయన కుమారుడు ఆకాశ్ అంబానీ.. తను ప్రేమించిన శ్లోకా మెహతా వివాహ ముందస్తు వేడుకలు ముంబైలో అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలో బాలీవుడ్ అంతా కలిసి వచ్చింది. బాలీవుడ్ బాద్ షా షారుఖ్ ఖాన్ - రణబీర్ కపూర్ - అర్జున్ కపూర్ చేసిన డ్యాన్సులు వైరల్ గా మారాయి.ఈ వీడియోల్లో ఐశ్వర్యరాయ్ - అభిషేక్ బచ్చన్ లు హైలెట్ గా నిలిచారు. ఈ కార్యక్రమానికి అమీర్ ఖాన్ - టైగర్ ష్రాఫ్ - కరణ్ జోహర్ - మాధురి దీక్షిత్ - అలియా భట్ ఇలా బాలీవుడ్ భారీ తారాగణం అంతా హాజరయ్యారు.

అకాశ్ అంబానీ-శ్లోకా మెహతాలదీ ప్రేమ పెళ్లి. వీరిద్దరూ చిన్ననాటి స్నేహితులు. ఒకరినొకరు ఇష్టపడడంతో పెళ్లి చేస్తున్నారు. శ్లోకా మెహతా కుటుంబం వజ్రాల వ్యాపారంలో పేరుగాంచింది. ఈ నూతన జంటకు ఈ ఏడాది చివరికల్లా పెళ్లి చేసేందుకు అంబానీ కుటుంబం నిశ్చయించింది . ఈ సందర్భంగా ముందస్తు పెళ్లి వేడుక నిర్వహించింది.  ఈ వేడుకకు బాలీవుడ్ అంతా కదిలిరావడంతో వారు చేసిన సందడి వీడియోలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Tags:    

Similar News