సైడ్ బిజినెస్ స్టార్ట్ చేసిన బాలీవుడ్ స్టార్స్‌!

Update: 2022-12-26 14:38 GMT
బాలీవుడ్ గ‌త కొంత కాలంగా గ‌డ్డు ప‌రిస్థితుల్ని ఎదుర్కొంటోంది. స్టార్ హీరోల నుంచి మినిమ‌మ్ గ్యారెంటీ హీరోల వ‌ర‌కు వ‌రుస ఫ్లాపులు, డిజాస్ట‌ర్ల‌తో స‌త‌మ‌త‌మ‌వుతున్నారు. క్రేజీ కాంబినేష‌న్‌లో చేసిన సినిమాలు కూడా బాక్సాఫీస్ వ‌ద్ద చేతులెత్తేస్తున్నాయి. దీంతో బాలీవుడ్ స్టార్స్ కి ఏం చేయాలో.. ఎలాంటి క‌థ‌ల‌తో ప్రేక్ష‌కుల్ని ఆక‌ట్టుకోవాలో అర్థం కావ‌డంలేదు. అమీర్ ఖాన్ కొంత విరామం త‌రువాత న‌టించి, భారీ స్థాయిలో నిర్మించిన 'లాల్ సింగ్ చ‌డ్డా' భారీ అంచ‌నాల మ‌ధ్య విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్ అనిపించుకుంది.

ఈ సినిమా ఫ‌లితంతో మ‌న‌స్తాపానికి గురైన అమీర్ ఖాన్ కొంత కాలం పాటు సినిమాల‌కు దూరంగా వుంటాన‌ని ప్ర‌క‌టించి షాకిచ్చాడు. ఇక బాలీవుడ్ ఖాన్ ల‌ని వెన‌క్కి నెట్టి బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బ‌స్ట‌ర్ లు, సూప‌ర్ హిట్ ల‌తో బాలీవుడ్ లో టాక్ ఆఫ్ ది ఇండ‌స్ట్రీగా నిలిచిన ఖిలాడీ హీరో అక్ష‌య్ కుమార్ సినిమాలు కూడా ఈ మ‌ధ్య ప్ర‌భావాన్ని చూపించ‌లేక‌పోతున్నాయి. అక్ష‌య్ న‌టించిన బ‌చ్చ‌న్ పాండే,  'స‌మ్రాట్ పృథ్వీరాజ్', ర‌క్షా బంద‌న్ వ‌రుస‌గా ఫ్లాపుల‌య్యాయి.

స‌మ్రాట్ పృథ్వీరాజ్' ప‌రిస్థితి అయితే మ‌రీ దారుణం థియేట‌ర్ల‌కు ప్రేక్ష‌కులు రాక‌పోవ‌డంతో ప‌లు చోట్ల షోల‌ని ర‌ద్దు చేయాల్సి వ‌చ్చింది. 'బ్ర‌హ్మాస్త్ర‌'తో కొంత ప‌ర‌వాలేద‌నిపించిన ర‌ణ్ బీర్ క‌పూర్ ప్ర‌స్తుతం త‌న ఆశ‌ల‌న్నింటినీ సందీప్ రెడ్డి వంగ 'యానిమ‌ల్‌'పైనే పెట్టుకున్నాడు.

ప్ర‌స్తుతం చిత్రీక‌ర‌ణ ద‌శ‌లో వున్న ఈ మూవీ వ‌చ్చే ఏడాది రిలీజ్ కాబోతోంది. ఇదిలా వుంటే ర‌ణ్ వీర్ సింగ్ హిట్ మెషీన్ గా పిల‌వ‌బ‌డే రోహిత్ శెట్టితో చేసిన 'స‌ర్క‌స్‌' కూడా డిజాస్ట్ గా నిలిచి షాకిచ్చింది.

ఈ నేప‌థ్యంలో కొంత మంది హీరోలు సైడ్ బిజినెస్ ని యాక్టీవ్ చేస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ విష‌యంలో అమీర్ ఖాన్‌, ర‌ణ్ బీర్ క‌పూర్ ముందు వ‌రుస‌లో నిలుస్తున్నార‌ట‌. పూణేకు చెందిన డ్రోన్ ఆచార్య ఏరియ‌ల్ ఇన్నేవేష‌న్స్ సంస్థ బాంబే స్టాక్ ఎక్స్చేంజి 80 శాతం ప్రీమియంతో షేర్ ల‌ని ప్ర‌క‌టించింది. ఒక్కో షేర్ కు ఆఫ‌ర్ రేట్ ని 52, 54గా ఆఫ‌ర్ చేసింది. అయితే దీనికి ఒక్కో షేర్ కు 102 ధ‌ర‌ప‌ల‌క‌డం విశేషం. దీంతో ఈ స్టార్ట‌ప్ కంప‌నీ షేర్లు ఒక్క‌సారిగా పుంజుకున్నాయ‌ట‌.

ఏకంగా రూ. 27.57 కోట్ల ట‌ర్నోవ‌ర్ ని న‌మోదు చేశాయ‌ట‌. ఈ ఐపీఓంలో బాలీవుడ్ స్టార్స్ అమీర్ ఖాన్ 46,600 షేర్ల‌ని కొనుగోలు చేసి రూ. 25 ల‌క్ష‌ల మేర పెట్టుబ‌డులు పెట్టిన‌ట్టుగా తెలుస్తోంది. ఇక ఇదే కంప‌నీలో ర‌ణ్ బీర్ క‌పూర్ కూడా 20 ల‌క్ష‌ల విలువైన 37,200 షేర్ల‌ని కొనుగోలు చేసిన‌ట్టుగా ఎక‌నామిక్స్ టైమ్స్ క‌థ‌నంలో వెల్ల‌డించింది.  వీరితో పాటు షారుక్ ఖాన్, ప్రీతి జింటా వంటి వారు ఐపీఎల్ లో పెట్టుబ‌డులు పెడుతున్న విష‌యం తెలిసిందే. 




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News