సూప‌ర్ స్టార్ కు పెద్ద అవ‌మానం.. ఇంత‌కంటే ఘోరం వుంటుందా?

Update: 2022-07-26 17:30 GMT
బాలీవుడ్ సినిమాల‌కు దెబ్బ‌మీద దెబ్బ త‌గులుతోంది. మునుపెన్న‌డూ లేని విధంగా స్టార్స్ న‌టించిన క్రేజీ మూవీస్ బాక్సాఫీస్ వ‌ద్ద దారుణ ఫ‌లితాల్ని సొంతం చేసుకుంటున్నాయి. దీంతో బాలీవుడ్ వ‌ర్గాలు ఏం జ‌రుగుతోందో అర్థాం కాక‌పోవ‌డంతో త‌ల‌లు ప‌ట్టుకుంటున్నార‌ట‌. కంగ‌న ధాక‌డ్‌, అక్ష‌య్ కుమార్ న‌టించిన 'సామ్రాట్ పృథ్వీరాజ్' చిత్రాలు బాక్సాఫీస్ వ‌ద్ద దారుణంగా ఫ్లాప్ అయ్యాయి. అంతే కాకుండా కోట్ల‌ల్లో న‌ష్టాల‌ని తెచ్చిపెట్టాయి.

వంద‌ల కోట్ల బ‌డ్జెట్ ల‌తో నిర్మించిన సినిమాలు బాక్సాఫీస్ వ‌ద్ద అందులో స‌గాన్ని కూడా తిరిగి రాబ‌ట్ట‌లేక‌పోతుండ‌టం ఇప్ప‌డు హాట్ టాపిక్ గా మారింది. తాజాగా విడుద‌లైన ర‌ణ్ బీర్ క‌పూర్ 'షంషేరా' అయినా ఈ ఫ్లాపుల ప‌రంప‌రు బ్రేకిచ్చి బాలీవుడ్ కు ఊపిరిపోస్తుంద‌ని భావించారు. కానీ ఇది కూడా అదే బాట‌లో దారుణ ఫ‌లితాన్ని అందించ‌డం బాలీవుడ్ వ‌ర్గాల‌ని మ‌రింత షాక్ కు గురిచేస్తోంది. బాలీవుడ్ లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌గా పేరున్న య‌ష్ రాజ్ ఫిలింస్ సంస్థ రూ.150 కోట్ల‌తో ఈ మూవీని నిర్మించింది.

అయినా స‌రే ఈ మూవీ బాక్సాఫీస్ వ‌ద్ద భారీ డిజాస్ట‌ర్ గా నిలిచింది. జూలై 22న అత్యంత భారీ స్థాయిలో విడుద‌లైన ఈ సినిమా ఆశించిన ఫ‌లితాన్ని అందించ‌లేక బాక్సాఫీస్ వ‌ద్ద చేతులెత్తేసింది. ఈ మూవీ షోస్ కి ఆశించిన స్థాయిలో ప్రేక్ష‌కులు రాక‌పోవ‌డంతో షోస్ క్యాన్సిల్ చేశార‌ట‌. ఇది ర‌ణ్ బీర్ క‌పూర్ లాంటి స్టార్ హీరోకు నిజంగా దారుణ అవ‌మాన‌మే అంటున్నాచి ట్రేడ్ వ‌ర్గాలు. నాలుగ‌వ రోజే ఈ సినిమా షోస్ ని చాలా చోట్ల ర‌ద్దు చేయ‌డం నిజంగా దారుణం అంటున్నారు.

కొన్ని చోట్ల అయితే ఆడియ‌న్స్ టికెట్ ల‌ని బుక్ చేసుకోవ‌డానికే ఆస‌క్తిని చూపించ‌లేదంటే ప‌రిస్థితి ఎంత దారుణంగా వుందో అర్థం చేసుకోవ‌చ్చు. దీంతో ఈ సినిమా బాక్సాఫీస్ వ‌ద్ద భారీ డిజాస్ట‌ర్ గా నిలిచి బాలీవుడ్ ఆశ‌ల‌పై నీళ్లు చ‌ల్లింది. తొలి రోజు ఈ మూవీ రూ. 10.24 కోట్ల‌ని  రాబ‌ట్టింది. సెకండ్ డే 10.50 కోట్లు, థ‌ర్డ్ డే 11కోట్లు రాబ‌ట్టింది.

ఈ క‌లెక్ష‌న్ ల ఆధారంగా ఈ మూవీ లైఫ్ టైమ్ క‌లెక్ష‌న్స్ ని 50 నుంచి 60 కోట్ల మేర సాధించే అవ‌కాశం వుంద‌ని  ట్రేడ్ వ‌ర్గాలు అంచ‌నాకు వ‌చ్చాయి. అయితే తాజాగా మండే రోజు వ‌సూళ్లు 70 శాతం వ‌ర‌కు ప‌డిపోయాయి. దీంతో ర‌ణ్ బీర్ లాంటి స్టార్ కు ఇంత‌టి అవ‌మానం, ఇంత‌కంటే ఘోరం వుంటుందా? అంటూ  కామెంట్ లు చేస్తున్నారు.

కేవ‌లం 4 కోట్లు మాత్రమే నేష‌న‌ల్ వైడ్ గా రాబ‌ట్ట‌డం గ‌మ‌నార్హం. దీంతో ఈ సినిమాకు దాదాపుగా రూ. 100 కోట్ల మేర న‌ష్టాల‌ని చ‌విచూడం ఖాయంగా క‌నిపిస్తోందిని, ఇది బాలీవుడ్ కు గ‌ట్టి షాక్ అని విశ్లేష‌కులు చెబుతున్నారు. శాటిలైట్‌, ఓటీటీల వ‌ల్ల ఏమైనా నిర్మాత ఈ న‌ష్టాల భారీ నుంచి కోలుకుంటాడే వేచి చూడాల్సిందే.
Tags:    

Similar News