కరోనా ప్రభావం అనంతరం తెలుగు చిత్ర పరిశ్రమ చాలా తొందరగానే కుదురుకున్నప్పటికీ బాలీవుడ్ చిత్ర పరిశ్రమ మాత్రం కోలుకోవడానికి చాలా సమయం పడుతుంది. ఇంకా బాలీవుడ్ ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద రికార్డులు క్రియేట్ చేసేంత పెద్ద సినిమాలు అయితే రాలేదు. ఈ గ్యాప్లో సౌత్ పాన్ ఇండియా సినిమాలు పూర్తిస్థాయిలో అక్కడ ఉన్న ప్రేక్షకుల అభిరుచులను కూడా మార్చేశాయి. ఇక రాబోయే సినిమాలు ఎలాంటి రిజల్ట్ ను అందుకుంటాయి అనే దాని మీదనే బాలీవుడ్ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంది అని చెప్పవచ్చు.
మొన్నటి వరకు టాలీవుడ్ చిత్ర పరిశ్రమలో విడుదల తేదీల కోసం తీవ్రస్థాయిలో చర్చలు జరిగిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా అదే తరహా పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయి. అందరూ ఎక్కువగా ముఖ్యమైన స్పెషల్ డేట్స్ కోసమే ఎగబడుతున్నారు. ఈ పోటీలో అక్షయ్ కుమార్ అజయ్ దేవగన్ అమీర్ ఖాన్ కంగానా రౌనత్ ఇలా అగ్రతారాల సినిమాలో పోటీ పడబోతున్నాయి.
అక్షయ్ కుమార్ నటించిన రక్షాబంధన్ సినిమా ఆగస్టు 11వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ఇదివరకే ఒక క్లారిటీ ఇచ్చారు. ఇక బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమా కూడా అదే తేదీకి రావాలని టార్గెట్ అయితే సెట్ చేసుకుంది.
ఇక మరొక రిలీజ్ డేట్ పై రెండు పెద్ద సినిమాలు పోటీ పడుతున్నాయి. మణిరత్నం పాన్నియిన్ సెల్వన్ మల్టీస్టారర్ సినిమాలో ఐశ్వర్య రాయ్ నటించిన విషయం తెలిసిందే. అందుకే ఈ సినిమాని హిందీలో కూడా సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేస్తున్నారు. అదే సమయానికి హృతిక్ రోషన్ సైఫ్ అలీ ఖాన్ నటించిన విక్రమ్ వేద రాబోతోంది.
ఇక కంగనా రనౌత్ నటించిన తేజడ్ సినిమా కరణ్ జోహార్ నటించిన మిస్టర్ అండ్ మిసెస్ సినిమాతో పోటీ పడేందుకు సిద్ధమవుతోంది. ఈ రెండు సినిమాలు కూడా అక్టోబర్ 7న వచ్చే అవకాశం ఉంది. అలాగే ఈ ఏడాది దీపావళికి అజయ్ దేవ్ గన్ నటించిన 'లైఫ్ డ్రామా', అక్షయ్ కుమార్ రామసేతు సినిమాలు రాబోతున్నాయి.
క్రిస్మస్ కు కూడా సినిమాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది. రణ్ వీర్ సింగ్ సర్కస్ తో పాటు విజయ్ సేతుపతి కత్రినాకైఫ్ ప్రధాన పాత్రల్లో నటించిన మేరీ క్రిస్మస్ అలాగే టైగర్ షాప్ గణపతి సినిమాలు కూడా అదే ఫెస్టివల్ కు రాబోతున్నాయి.