2017 లో పెద్దగా అంచనాలు లేకుండా తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చిన విక్రమ్ వేద సినిమా సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఆ సినిమా గురించి ఇతర ఇండస్ట్రీలో కూడా మాట్లాడుకునే రేంజ్ లో సక్సెస్ అందుకోవడం విశేషం.
అంతే కాకుండా తెలుగులో కూడా ఈ సినిమాను రీమేక్ చేయాలని అప్పట్లో కొంతమంది హీరోలు ప్రయత్నాలు కూడా చేశారు. కానీ కమర్షియల్గా ఆలోచించి మళ్లీ వెనుకడుగు వేశారు. అలాగే దర్శకులు కూడా ఎవరు కూడా ఆ ప్రాజెక్టును హ్యాండిల్ చేయడానికి ధైర్యం చేయలేకపోయారు.
అయితే హిందీలో మాత్రం ఈ సినిమాను ఎలాగైనా తెరపైకి తీసుకురావాలని దర్శక ద్వయం పుష్కర్ గాయత్రి ప్రయత్నాలు చేసి మొత్తానికి ఈ సినిమా షూటింగ్ ను అయితే పూర్తిచేశారు. బాలీవుడ్లో కూడా ఈ సినిమాను రీమేక్ చేసేందుకు కొంత మంది హీరోలు బాగానే పోటీపడ్డారు కానీ పుష్కర్ గాయత్రి మాత్రం ఈ సినిమాను హృతిక్ రోషన్ తో తెరపైకి తీసుకు వచ్చేందుకు ఆసక్తి చూపించారు.
ఇక మరొక ముఖ్యమైన పాత్రలో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఒరిజినల్ గా తమిళంలో మాధవన్ విజయ్ సేతుపతి నటించిన విషయం తెలిసిందే. వారు ఇద్దరు కూడా సినిమాలో పోటాపోటీగా నటించి ఎంతగానో ఆకట్టుకున్నారు. ఇక ఇప్పుడు అంతకంటే ఎక్కువగా ఈ సస్పెన్స్ థ్రిల్లర్ లో హృతిక్ రోషన్ సైఫ్ అలీఖాన్ పోటీ పడేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సినిమా షూటింగ్ మొత్తాన్ని ఇటీవలే పూర్తి చేసినట్లుగా చిత్ర యూనిట్ సభ్యులు క్లారిటీ ఇచ్చేసారు.
అంతే కాకుండా ప్రత్యేకంగా హృతిక్ రోషన్ కూడా సోషల్ మీడియాలో చిత్ర యూనిట్ సభ్యులతో కలిసి ఒక ప్రత్యేకమైన ఫోటో కూడా పోస్ట్ చేశాడు. ఈ సినిమా చాలా పవర్ఫుల్గా మీ ముందుకు రాబోతోంది అని త్వరలోనే రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇవ్వనున్నట్లు తెలియజేశారు.
అయితే బాలీవుడ్ ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఈ సినిమా ఇదే ఏడాది సెప్టెంబర్ 30వ తేదీన విడుదల చేయాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. త్వరలోనే రెగ్యులర్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేయాలని అనుకుంటున్నారు. మరి హిందీ విక్రమ్ వేదా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందో చూడాలి.