నేషనల్ లెవెల్ యాక్టర్స్ ప్రస్తుతం ఇండియన్ సినిమాల్లో చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో బాలీవుడ్ యాక్టర్సే ఎక్కువగా ఉన్నారు. ఏ కథలో అయినా పాత్రలకు తగ్గట్టుగా మారిపోవడం వారి టాలెంట్. హీరోల రేంజ్ లో వారిని గౌరవించడం ఎప్పటి నుంచో వస్తున్నదే. కొందరు దర్శకులైతే ప్రత్యేక పాత్రలు చేసే నటి నటులను దృష్టిలో ఉంచుకొని క్యారెక్టర్ ను డిజైన్ చేస్తున్నారు. బోమన్ ఇరానీ గారి గురించి అందరికి తెలిసే ఉంటుంది.
అత్తారింటికి దారేది సినిమాలో పవన్ కళ్యాణ్ తాత పాత్రలో తన నటనతో అందరిని ఆకట్టుకున్నారు. బాలీవుడ్ లో త్రి ఇడియట్స్ - పీకే వంటి సినిమాలతో ఆయనకు మంచి గుర్తింపు ఏర్పడింది. ఇకపోతే తమిళ్ లో ఆయన ఇంతవరకు ఒక్క సినిమా కూడా చేయలేదు. గతంలో ఒక సినిమాలో అవకాశం వచ్చినప్పటికీ డేట్స్ కుదరకపోవడం వల్ల చేయలేకపోయారు. ఇక మొదటసారి సూర్యా సినిమా ద్వారా బోమన్ ఇరానీ కోలీవుడ్ లో అడుగుపెట్టనున్నారు. కేవీ ఆనంద్ దర్శకత్వంలో సూర్య ఒక ప్రాజెక్ట్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.
అందులో మోహన్ లాల్ తో పాటు అల్లు శిరీష్ కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు. ఇక ఒక స్పెషల్ క్యారెక్టర్ కోసం బోమన్ ఇరానీ గారిని సెలెక్ట్ చేసుకున్నట్లు తెలుస్తోంది. అక్కడ మొదటి సినిమా కావడంతో కోలీవుడ్ జనాల్లో ఆసక్తి నెలకొంది. జూన్ 25న మొదటి షెడ్యూల్ ని స్టార్ట్ చేయనున్నారు. ప్రస్తుతం సూర్య సెల్వ రాఘవన్ దర్శకత్వంలో NGK అనే సినిమా చేస్తున్నాడు.