ఓ హెటల్లో వెయిటర్ .. ఇంతింతై వటుడింతై అన్న చందంగా ఎదిగి నేడు ఏకంగా సువిశాల సినీప్రపంచంలో నిర్మాతగా ఎదిగిన వైనం ప్రస్తుతం బాలీవుడ్ మీడియాలో హాట్ డిబేట్. ఇంతకీ ఎవరా వ్యక్తి? అంటే ది గ్రేట్ బొమన్ ఇరానీ గురించే ఇదంతా.
ముంబై తాజ్ మహల్ హోటల్ లో వెయిటర్‌గా పనిచేసిన బొమన్ ఇరానీ ఓ వైపు వెయిటర్‌గా పనిచేస్తూనే మరో వైపు స్టిల్ ఫొటోగ్రాఫర్‌గా తన టాలెంట్ ని చూపించిన చివరికి రంగస్థల నటుడిగా ముంబై థియేటర్ గ్రూప్ లో ఒకడిగా పేరు తెచ్చుకున్నాడు. అక్కడి నుంచే అతని అడుగులు సినిమావైపు సాగాయి. సినిమాల్లోకి ఎంటరైన ఆయన అనతి కాలంలోనే తనదైన మార్కును క్రియేట్ చేసుకున్నారు. బొమన్ కి కేవలం నార్త్ లోనే కాదు ఇటు సౌత్ లోనూ వీరాభిమానులున్నారు. మన దర్శకులు బొమన్ ఇరానీకి అవకాశాలిచ్చి ఎంకరేజ్ చేశారు.
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ `అత్తారింటికి దారేది` సినిమాలో కీలక పాత్ర పోషించిన బొమన్ తెలుగు ప్రేక్షకులను మెప్పించాడు. బాలీవుడ్ చిత్రాల్లో ముఖ్యంగా రాజ్‌కుమార్ హిరానీ చిత్రాల్లో కీలక పాత్రల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్నారాయన. నటుడిగా మంచి స్థాయిలో వున్న బొమన్ తాజాగా నిర్మాణ రంగంలోకి అడుగుపెట్టారు. ఇరానీ మూవీ టోన్ పేరుతో నూతన నిర్మాణ సంస్థను స్థాపించారు. ఈ ప్రొడక్షన్ హౌజ్‌ను లేటెస్ట్ గా బిగ్ బీ అమితాబ్ బచ్చన్ లాంఛనంగా ప్రారంభించారు. ``సినిమా మారుతోంది. దానికి తగ్గట్టుగా నిర్మాణ సంస్థలు మారాల్సిన అవసరం ఎంతో వుంది. అందుకు నా ప్రయత్నంగా కొత్త ఆలోచనలతో సినిమాలు నిర్మించాలని నూతన నిర్మాణ సంస్థను స్థాపించాను`` అని బోమన్ ఇరానీ పేర్కొన్నారు. వెయిటర్ .. స్టిల్ ఫోటోగ్రాఫర్.. యాక్టర్.. ఇప్పుడు నిర్మాత.. ఇకపై ఇంకా ఏం సాధిస్తాడో..!!